రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారు..

ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో దుష్టుపాలన సాగింది

రోజూకో అబద్ధం..పూటకో మోసం..

ధర్మానికి,అధర్మానికి యుద్ధం జరుగుతుంది

చంద్రబాబుది దుర్మార్గపు పాలన

కావలి ప్రచార సభలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

నెల్లూరు జిల్లా:ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో దుష్టపాలన సాగిందని,తండ్రికొడుకులిద్దరూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని వైయస్‌ఆర్‌సీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు.నెల్లూరు జిల్లా కావలిలో  ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది.గత పదిరోజులుగా మీడియాలో చంద్రబాబు కనీసం వందసార్లు జగన్‌ పేరే చెబుతున్నాడు.నేరుగా చంద్రబాబు నాయుడి ఒకే ఒక ప్రశ్న వేస్తున్నా..మీ పరిపాలన చూపించి ఓటు ఎందుకు అడగలేకపోతున్నారు అని అడుగుతున్నా.. ఒక సామెత ఉంది. చేత గానివాడికి కోపమెక్కువ..పనిచేయలేని వాడికి అకలి ఎక్కువ..చంద్రబాబు పరిస్థితి అలానే ఉంది. చంద్రబాబు ఆయన కొడుకు ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు. ఎప్పడులేనంతగా దుష్ట పాలన సాగిస్తున్నారు.

వీరి పాలన గురించి చర్చ జరగకుండా టివీ ఛానెళ్లను కూడా మేనేజ్‌ చేశారు. రోజూ అధికారంలో లేనివారి గురించి విమర్శిస్తే టివీల్లో డిబేట్‌ జరుగుతుంది. నేడు ధర్మానికి,అధర్మానికి యుద్ధం జరుగుతుంది. చంద్రబాబు దుర్మార్గ పాలన చూసి,  కండువాలు కప్పుతామన్న కూడా చంద్రబాబు  దగ్గరకు వచ్చేవారు లేరు.ఎందుకు ఈ పరిస్థితి చంద్రబాబుకు ఎందుకు వచ్చిందనేది అందరికి తెలుసు. 2014 ఎన్నికలలో చంద్రబాబు ఏం చెప్పారు.ఐదేళ్లగా ఏం చేశారనేది మనందరికి తెలుసు. గత ఎన్నికల్లో చంద్రబాబు 50 పేజీల వాగ్ధానాలు చేశారు. ఇందులో 12 వ పేజీలో స్వయంగా చంద్రబాబు 12 వాగ్ధానాలు చేసి సంతకాలు కూడా పెట్టాడు.ఎన్నికల ప్రణాళిక ఇచ్చాడు. అంతటితో సరిపోలేదు. ఇంటింటికి చంద్రబాబు ఒక లేఖను కూడా పంపించాడు.

ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు 650 హామీలు ఇచ్చాడు.ౖ రెతులకు రుణమాఫీపై మొదటి సంతకం అన్నాడు.. మీ రుణాలు మాఫీ చేశాడా..? అని అడుగుతున్నా.. ఆయన హయాంలో అధికారంలో వచ్చే నాటికి 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉంటే..కనీసం రైతులకు వడ్డీలకు కూడా సరిపోలేదు.నేడు వ్యవసాయ రుణాలు లక్ష 30వేల కోట్ల రూపాయలు ఎగబాకాయి. ఇదే పెద్దమనిషి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ అన్నాడు.. ఎక్కడైనా కనిపించిందా..? డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేస్తామన్నాడు..రుణాలు మాఫీ చేశాడా..?ఆడ్డ బిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం 25వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామన్నాడు..చేశాడా?,జాబు కావాలంటే బాబు రావాలంట..ఇంటికో ఉద్యోగమంట,ఉపాధి దొరికే వరుకూ ఇంటింటికి నెలకు 2వేలు అంట..ఇచ్చారా రెండువేలు అని అడుగుతున్నా.. ప్రతి ఇంటికి లక్ష 20వేలు బాకీ పడ్డాడు.ఎన్టీఆర్‌ సుజలపథకం అంట..రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ అంట..ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతున్నా.. బీసీలకు సంవత్సరానికి 10వేల కోట్ల సబ్‌ప్లాన్‌  అంట..ఇచ్చారా అని అడుగుతున్నా.. పేదవాళ్లకు మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అంట...ఇళ్లు ఇచ్చారా అని అడుగుతున్నా. దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నాడు. నాలుగు రోజుల్లో ఈ మాదిరిగానే ఫోజులిచ్చి..మళ్లీ కొత్త సినిమా ప్రారంభిస్తాడు. మేనిఫెస్టోలో వాగ్ధానాలు ఏమీ అమలు చేయలేదు. ఒకటయినా అమలు చేశారా..మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు.ప్రజలను కొడతారనే భయంతో మాయం చేశాడు. ఎన్నికల మేనిఫెస్టో అంటే గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి.

కాని చంద్రబాబు.. చెప్పిన మాటలను నిలబెట్టుకోకుండా ఐదు సంవత్సరాలు ఒక దోపిడీ ముఠాగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఏ ఒక వర్గానికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదు. నాలుగేళ్ల బీజేపీతో సంసారం చేస్తాడు.ఒకరినొకరు పొగుడుగుకుంటారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలోకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంత్రులుగా కొనసాగుతున్నారు.కాని ప్రత్యేక హోదా కోసం అడగరు. ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి  బీజేపీతో తానే పోరాటం చేస్తున్నట్లు నల్లచొక్కాలు వేసుకుని ధర్మపోరాట దీక్షలు చేస్తారు.హరికృష్ణ శవం పక్కనే టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం మాట్లాడతారు.వాళ్లు  కుదరయ్యా అంటారు. తర్వాత టీఆర్‌ఎస్‌తో నేను పోరాడతాను అని బిల్డప్‌ ఇస్తాడు. చంద్రబాబు చేస్తే సంసారం..వేరేవాళ్లు చేస్తే సంసారం.ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నైజాన్ని,మోసాని చూడమని అడుగుతున్నా..ఆయన పార్టీ నుంచి అభ్యర్థుల లేక లిస్ట్‌ ఒకేసారి ప్రకటించలేని చంద్రబాబు..టీఆర్‌ఎస్‌ వాళ్లు బెదిరిస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు పాలనలో ప్రతిపక్ష పార్టీకి చెందిన  23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు.ఐదు సంవత్సరాల చంద్రబాబు మంచి పాలన చేస్తే మీ ఎల్లో మీడియాలో రోజూ మీ పరిపాలనపై చర్చపెట్టకుండా ప్రతిపక్షంపై ఎందుకు ఏడుస్తున్నారు  అని అడుగుతున్నా.

చంద్రబాబు మంచి పాలన చేయలేక రోజుకోక అబద్ధం,పూటకో మోసం చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో మూటలు మూటలుగా  గ్రామాల్లోకి డబ్బులు పంపిస్తాడు. మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు,వార్డులకు వెళ్ళినప్పుడు ప్రతి అక్కాచెల్లెమ్మ,తాతా,అవ్వా,అన్న దగ్గరకు వెళ్ళండి.. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దు. రాబోయే 20 రోజుల్లో మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందాం..అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత..మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు..సంవత్సరానికి 15వేలు ఇస్తాడని చెప్పండి.మన పిల్లలను ఇంజనీర్లు,డాక్టర్లు,కలెక్టర్లుగాను చదివించుకోవాలంటే మన ఆస్తులను అమ్ముకోవాలి.20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం మన పిల్లలను ఇంజనీర్లు,డాక్టర్లు,కలెక్టర్లు గాను చదివించుకుందాం అని చెప్పండి.ఎన్ని లక్షలు పర్వాలేదు అన్న చదిస్తాడు అని చెప్పండి.

ఎస్టీ,ఎస్సీ,బీసీ,మైనార్టీలుగా ఉంటూ పేదరికంలో అలమట్టిస్తున్న 45 ఏళ్ల నుంచి  60 ఏళ్ల వయసున ప్రతి అక్కకు చెప్పండి.అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం.ప్రతి అక్క చేతిలోనూ నాలుగుదఫాలుగా 75వేలు పెడతాడని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టండి..అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం..ఎన్నికల తేదీ వరుకూ ఎంతయితే రుణాలు ఉన్నాయో మొత్తం రుణాలన్ని కూడా నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తారని ప్రతి అక్కాచెల్లెమ్మలకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి  అయితే సున్నా వడ్డీలకే రుణాలిచ్చే పరిస్థితి వస్తుందని చెప్పండి మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని చెప్పండి.రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందిస్తాం.ప్రతి ఏటా రైతుకు రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తాం.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top