ప్రధాని నరేంద్ర మోదీకి వైయ‌స్‌ జగన్‌ అభినందనలు 

తాడేపల్లి : ప్రధాని నరేంద్ర మోదీకి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేసుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు వైయ‌స్‌ జగన్ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్ష‌లు తెలిపారు.  

ఆ ట్వీట్‌లో..

‘ప్రజా సేవలో అంకితభావంతో పని చేసి,  ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది మోదీ పట్టుదల, సంకల్పానికి నిదర్శనం. దేశ సేవలో ప్రధానికి శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నా’అని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.   

Back to Top