ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూతపై వైయస్ జగన్ సంతాపం

 
తాడేప‌ల్లి: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ (90) గారు కన్నుమూయడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ స్వామివారి సేవలో అంకితభావంతో పనిచేసిన సౌందర్ రాజన్ గారు భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా గుర్తింపు పొందారని వైయస్ జగన్ పేర్కొన్నారు. సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. వారి మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని పేర్కొన్న వైయస్ జగన్, సౌందర్‌ రాజన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.

Back to Top