కోర్టు తీర్పు సంతోషదాయకం

చట్టాలు పట్టనట్లు వ్యవహరిస్తున్న వారికి గుణపాఠం

కేసును తప్పుదోవ పట్టించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి

వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ కన్వీనర్ సుధాకరరెడ్డి

హైదరాబాద్:  నిజాన్ని దాచిపెట్టాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును సమర్ధంగా ఎదుర్కున్నాం.  వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జరిగిన హత్యా యత్నం ఘటన కేసు విచారణను ఎన్ఐఎకు బదలాయించడం చాలా సంతోషకరమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ పొన్నవోలు సుధాకరరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో అసలు నేరస్థులను, కుట్రదారులను, పాత్రధారులను బయటకు రాకుండా చేస్తున్న తరుణంలో కోర్టును ఆశ్రయించామన్నారు. ఈ రాష్ట్ర ప్రబుత్వం  చట్టాలను (ఎన్ఐఎ చట్టం, సివిల్ ఏవియేషన్ యాక్టు లను)  తొక్కిపెట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టకుండా రాజ్యాంగాన్ని వ్యవస్థలను తొక్కిపెట్టి డిజిపి చేత చట్టాలు వర్తింపవన్నట్లుగా వ్యవహరించిన నేపథ్యాన్ని గౌరవనీయ న్యాయస్థానానికి వివరించామన్నారు.  చాలాచిన్న విషయంగా 307 సెక్షన్ తో సరిపెట్టాలనుకున్నదనీ, దాని వెనుక కుట్ర కోణాలను మరుగున పెట్టాలని చూసిందన్నారు. కేసును తప్పుదోవ పట్టించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించినట్లు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం చట్టాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నా, ఆయన కంటే చట్టం చేతులు చాలా విస్తారమైనవని తేటతెల్లం అయ్యిందన్నారు.

Back to Top