టీడీపీ కంచుకోటలో మంత్రి కాకాణికి ఘన స్వాగతం

పొద‌ల‌కూరు మండ‌లంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం

నెల్లూరు జిల్లా:  తెలుగు దేశం పార్టీ రోజు రోజుకు బ‌ల‌హీన‌ప‌డుతోంది. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌తో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉంటున్నారు.  రెండు రోజులుగా టీడీపీ కంచుకోట‌గా ఉన్న గ్రామాల్లో మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి నిర్వ‌హించిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి విశేష ఆద‌ర‌ణే ఇందుకు నిద‌ర్శ‌నం. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, దుగ్గుంట గ్రామంలో నిర్వ‌హించిన‌ "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మంత్రికి హరతులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌తో తాము సంతోషంగా ఉన్నామ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మ‌ళ్లీ జ‌గ‌న‌న్నే ముఖ్య‌మంత్రి కావాల‌ని టీడీపీకి చెందిన కుటుంబాలే మంత్రితో చెప్పారు. 
 ఇంటింటికి వెళ్లి ఆయా కుటుంబాలతో మమేకమవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వారు పొందిన సంక్షేమ లబ్దిని తెలిపే బుక్లెట్ ను అందిస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

  తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అత్యధిక మెజారిటీ తెచ్చే దుగ్గుంట గ్రామంలో కూడా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని స్పష్టం అవుతుందని ఆనందం వ్యక్తం చేసిన మంత్రి.

  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార పార్టీ శాసనసభ్యునిగా పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడంతో, ప్రజలకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల స్పందన కనిపించడానికి కారణమైందని మంత్రి పేర్కొన్నారు. 
  ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని సర్వేపల్లి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వివ‌రించారు. ఇందులో భాగంగా 66 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సైడు డ్రైన్ ను మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ప్రారంభించారు. 

Back to Top