సీఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసిన విశాఖ నేత‌లు

విశాఖపట్నం: ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోట‌ల్‌లో జ‌రిగిన ఏపీ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌న్నాహ‌క స‌ద‌స్సులో విశాఖ‌ప‌ట్నం త్వ‌ర‌లో ఏపీకి రాజధాని కాబోతుంద‌ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇచ్చిన మాట ప్ర‌కారం విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేస్తున్నార‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ విశాఖ జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు ఆధ్వ‌ర్యంలో ముఖ్య‌మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సైతం హాజరయ్యారు. 

అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందలనేది సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆలోచన అని,  మరో రెండు నెలల్లో విశాఖ రాజధాని కాబోతోంద‌ని, సీఎం కూడా వైజాగ్ వచ్చి నివాసం ఉంటారు అని మంత్రి అమ‌ర్‌నాథ్ తెలిపారు. త్వరలో విశాఖలో జరిగే సదస్సులు ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చబోతున్నాయని చెప్పారు. మహిళా భద్రతలో విశాఖ టాప్ 10 నగరంలో ఉందంటే దానికి సీఎం వైయ‌స్ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అక్రమాని విజయనిర్మల, కోలా గురువులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. 

Back to Top