తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి

అమ‌రావ‌తి:  క‌ర్నాట‌క రాష్ట్రంలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప‌రామ‌ర్శించారు.  ఇవాళ బెంగళూరు వెళ్లిన ఆయన.. ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించారు.. వైద్యులను అడిగి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. అనంతరం మీడియాతో  విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.. 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన మెదడులో పైభాగం దెబ్బతింది.. దానివలన మెదడులో నీరు చేరి మెదడు వాచినట్టు తెలిపారు.. అయితే, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు చెప్పినట్టు విజ‌య‌సాయిరెడ్డి వివరించారు. గుండె బాగానే పనిచేస్తుందని.. తారకరత్న త్వరలోనే కోలుకుంటారని  విజయసాయిరెడ్డి తెలిపారు. 

Back to Top