చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టిన విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీః సామాజిక న్యాయం కోసం జనాభా ప్రతిపాదికన వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని  వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కోరారు.జనాభా నిష్పతి ఆధారంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గతంలో ఆయన ప్రవేశపెట్టిన  ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపై రాజ్యసభ చర్చ చేపట్టింది.రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చను  విజయసాయిరెడ్డి ప్రారంభించారు.జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.ఎస్టీ,ఎస్సీ తరహాలోనే బీసీలపై అత్యాచారాల నిరోధానికి చట్టం తీసుకురావాలన్నారు.

ఎలాంటి చట్టం లేకున్నా ఆంధ్రలో  60 శాతం కేబినెట్‌ బెర్త్‌లను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వెనుకబడిన వర్గాలకు కేటాయించారని తెలిపారు.అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలని తెలిపారు.ఎస్పీ,ఎస్టీ తరహాలోనే బీసీలపై దాడులను అరికట్టడానికి ప్రత్యేకచట్టం తీసుకురావాలని పేర్కొన్నారు.బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని కోరారు.ఓబీసీ సంక్షేమం కోసం రాజ్యాంగ సవరణకు బిల్లుకు మద్దతు పలకాలని అన్ని రాజకీయపార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ కింద ఉన్న నిధులను బీసీల వృత్తిపరమైన కులాలకు అందజేయాలని కోరారు.
 

Back to Top