టిడిపి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి 

ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజలకు వివరించండి 

 అనుబంధ విభాగాల సమావేశాలలో వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి 

 తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను  తిప్పికొట్టాలని  వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్, రాజ్యసభ సభ్యులు  విజయసాయిరెడ్డి  పిలుపునిచ్చారు. తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యలయంలో మూడు రోజులుగా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు,జిల్లా అధ్యక్షులుతో ఎంపీ విజ‌యసాయిరెడ్డి వరుసగా సమావేశాలను  నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా పార్టీ ఎస్సీ విభాగం సమావేశం  ఆ విభాగ అధ్యక్షులు జూపూడి ప్రభాకర్, ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్,ఎమ్మెల్యే అనిల్ కుమార్ నేతృత్వంలో విజయసాయిరెడ్డి అధ్యక్షతన జరిగింది..వైయ‌స్ఆర్ సిపి రాష్ట్ర ఎస్సీ విభాగానికి నలుగురు అధ్యక్షులు ఉండగా మరో అధ్యక్షుడుగా రెల్లి సామాజీక వర్గానికి కూడా పదవి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు..

అలాగే రాష్ట్ర స్థాయి ఎస్సీ మహాసభ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయ్యాలి అన్నదాని పై మెజారిటీ నాయకులు విజయవాడలో ఏర్పాటు చెయాలని కోరారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి   విజయసాయిరెడ్డి   మాట్లాడుతూ ..దళితులకు ఈ ప్రభుత్వంలో  పెద్దఎత్తున సంక్షేమ పధకాలు అందుతున్నాయని అన్నారు. దళితులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుందో  ఇంటింట ప్రచారంలో ప్రతి దళితుడుకి వివరించాలని పిలుపునిచ్చారు. 

పార్టీ కొసం పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీలో పదవులు అవకాశాలు రాకపోవచ్చని వారికి కూడా న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. స్ధానికంగా గ్రూపు రాజకీయాలను ఆస్కారం లేకుండా
పార్టీ అనుబంధ విభాగాల నాయకులు ఎమ్మెల్యే, సమన్వయ కర్తలతో సమన్వయం చేసుకొని పార్టీ కోసం పని చేయాలని అన్నారు. 

పార్టీ జోనల్,జీల్లా స్థాయి కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చెయాలని కోరారు.అందుకోసం ఎమ్మెల్యే , సమన్వయకర్తలతో వచ్చే సోమవారం టెలికాన్పురెన్స్ నిర్వహిస్తామన్నారు..

 ఈ సందర్భంగా విభాగ అధ్యక్షుల్లో ఒకరైన జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ..వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో ఈ నాలుగేళ్ల కాలంలో 1.7 కోట్లు కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.53,919 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు..దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులకు ఏపీ లో ఎక్కవ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు..వైయ‌స్ఆర్ సిపికి  మొదటి నుంచీ దళితులు కుడి భుజంగా నిలుస్తున్నారని  చెప్పారు..

మరో అధ్యక్షుడు ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ దళితులు అందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మళ్లీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. వైయ‌స్ఆర్ సిపి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికోట్టాలని పిలుపునిచ్చారు.

 రైతులకు  చేసిన మేలును వివరించండి 

అనంతరం రైతు విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి నేతృత్వంలో రైతు విభాగ సమావేశం జరిగింది..విజయసాయిరెడ్డి  మాట్లాడుతూ..రాబోవు 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సిపి విజయమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.  రానున్న ఎన్నికలకు తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉందని, దీంతో వైసిపి ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. అలాగే నియోజకవర్గ, మండల రైతు విభాగం కమిటీలను ఏర్పాటు చేసి సభ్యులను నియమించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కవగా పండిస్తున్న  మిర్చిబోర్డును గుంటూరులో ఏర్పాటుపై కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దామని అన్నారు..

పరిష్కారం కాని రైతుల సమస్యలను తన దృష్టికి తీసుకోస్తే కేంద్రం దృష్టికి తీసుకేళ్తానని చెప్పారు.. అలాగే కార్మిక విభాగ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వం అని చెప్పారు.. కార్మికులు సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు.. కార్మిక సంఘాలను సంఘటితం చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలుపుకు కృషి చెయాలని కోరారు..

చివరగా గిరిజన విభాగ అధ్యక్షుడు ఎం.హనుమంత్ నాయక్ నేతృత్వంలో గిరిజన విభాగ సమావేశం జరిగింది..ఈ సమావేశాన్ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి  మాట్లాడుతూ మైదాన ప్రాంతంలో గిరిజనులకు పార్టీ పదవులను తగ్గించి గిరిజనలు ఎక్కువ శాతం ఉన్న ప్రాంతాలలో ఎక్కువ పదవులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పారు..44 అసెంబ్లీ స్థానాలలో గిరిజనలు ప్రభావితం చేస్తున్నారని, ప్రభుత్వం నుండి గిరిజనులకు అందుతున్న లబ్ధిని ఇంటింటికీ కార్యక్రమంలో ప్రతి గిరిజనుడుకీ వివరించాలని కోరారు. అనుబంధ విబాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు,జిల్లా అధ్యక్షులు అభిప్రాయాలను తెలుసుకున్నారు.

తాజా వీడియోలు

Back to Top