వైయ‌స్ జ‌గ‌న్‌తో విజ‌య‌సాయిరెడ్డి  ఆత్మీయ ఆలింగ‌నం

 
 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఆత్మీయ ఆలింగనంతో అభినందనలు తెలిపినట్లు వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్ఆర్ సీపీ  ప్రభంజనం సృష్టించడంతో తమ అధినేత వైఎస్‌ జగన్‌ను 10.30 గంటలకు స్వయంగా కలిసానని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను సైతం షేర్‌ చేశారు.  ఇక ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్ఆర్ సీపీ 150 సీట్ల ఆధిక్యంలో ఉండగా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో 21 స్థానాల్లో గెలుపుదిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 

Back to Top