దేవాలయాల దీప దూపా నైవేద్యాల కోసం నిధులు 

విజయవాడ : దేవాలయాల దీప దూపా నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తామని దేవాదాయశాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. శుక్రవారం దేవాదాయ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ, దేవావలయాల అభివృద్ధిపై చర్చించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. దేవాదాయశాఖలో ఖాళీలు అన్ని భర్తీ చేస్తామని, అర్చకులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

అదే విధంగా ప్రతి భక్తుడికి దేవాలయాలు అందుబాటులో ఉండేలా చేస్తామని, సూరయ్యపాలెంలో సుమారు 10 ఎకరాల భూమిని టీడీపీ ఇష్టం వచ్చిన వారికి దరాదత్తం చేశారని మండిపడ్డారు. ఆ భూములపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని, వాటిపై విచారణ జరిపిస్తామని అన్నారు. చంద్రబాబు హయాంలో తన బినామీలకు ఇష్టానుసారంగా భూములు కేటాయించారని, ప్రస్తతం ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబుకు దేవుళ్లంటే భయం లేదని, బాబు కూల్చి వేసిన దేవాలయాలను త్వరలోనే నిర్మిస్తామని పేర్కొన్నారు. 

Read Also: రాష్ట్రానికి పండగొస్తోంది..

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top