మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ పంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వాసిరెడ్డిపద్మను పలువురు అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మంత్రులు తానేటి వనిత, గుమ్మనూరు జయరాం, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా,  ఎమ్మెల్యేలు  పాల్గొన్నారు.

Back to Top