ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటి?

ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ
 

గుంటూరు: ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఎమ్మెల్యేను కులం పేరుతో దూషించిన కేసు విషయంలో గుంటూరు రూరల్‌ ఎస్పీతో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. దేవుడి వద్దకు వెళ్తే మైల పడతారనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అంటరానితనాన్ని రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటం నేరమని చెప్పారు.

Back to Top