శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం నడింపల్లి పంచాయతీ పరిధిలోని పోలేపల్లి గ్రామంలో ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను పలకరిస్తూ, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రతి గడపగడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, నాడు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి, అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని విమర్శించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం పార్టీ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలకు మేలు చేసే విధంగా వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మండల ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే నడింపల్లి పంచాయతీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.