"మనం ప్రజలకు సేవకులం మాత్రమే" సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తరుచూ చెప్పే మాట. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండాలి కానీ..పథకాలు చెట్లకు కాయలు కాసినట్లు కాస్తాయి. ఆలోచనలు వాటంతటకవే పుట్టుకొస్తాయి. ప్రభుత్వ ఖజానాలోని ప్రతిపైసా ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయడమే నిజమైన అభివృద్ది. సంపదను పంచడంలోనే నిజమైన ఆర్థిక సూత్రాలు దాగున్నాయి. మే30, 2019న వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టారు. అప్పటి నుంచి ఇచ్చిన మాట ప్రకారం పాలన చేస్తున్నారు. " నాన్న రెండు అడుగులు వేస్తే.. మీ కోసం నేను నాలుగు అడుగులు వేస్తాను" అన్న వైయస్ జగన్ ఆ విధంగానే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సీఎం వైయస్ జగన్ పాలన బాగుంది కాబట్టే దేశంలో అనేక సార్లు బెస్ట్ సీఎంల లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. వైయస్ జగన్ 23 నెలల పానలో సగం కరోనానే తినేసింది. కానీ..ఎక్కడా కూడా కరోనా నష్టం చేసిందని సంక్షేమ పథకాలు ఆపలేదు. కరోనాను అరికట్టడంలోనే దేశంలో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లోనూ వ్యాక్సిన్‌లు ఇవ్వడంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఒక్క రోజే 6 లక్షలకు పైగా వ్యాక్సిన్లు ఇచ్చి సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం రికార్డ్ సృష్టించింది. మే1 నుంచి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీలతో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. ఫ్రీ వ్యాక్సిన్‌కు సీఎం జగన్ ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇప్పటికే అర లక్షకుపైగా బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కూడా బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత లేదు. రాష్ట్రంలో కరోనా వ్యాధిగ్రస్తుల రికవరీ రేట్ 92.53 శాతం ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. 104 కేంద్రంగా కరోనా సోకిన వారికి వైద్య సేవలు ఇంటి గడప తొక్కేలా డాక్టర్లు మూడు షిఫ్ట్‌ల్లో పని చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగులను దోచుకోకుండా కఠినమైన చర్యలు చేపడుతున్నారు. కోవిడ్‌ను ధైర్యంగా, కలిసికట్టుగా ఎదుర్కోవాలని సీఎం పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి గడ్కరీ అడిగిన వెంటనే మహారాష్ట్రకు 300 వెంటిలేటర్లు తక్షణమే పంపి సాయం చేసిన దయార్థ హృదయుడు సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి. ఒక పక్క కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొంటూనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగకుండా తీసుకెళ్తున్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారం అనుభవించడానికి పదవి చేపట్టలేదు. ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడానికి వచ్చారు. "ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను" సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజున వైయస్ జగన్ తన అభిమానుల సమక్షంలో ప్రకటించారు. అన్నట్లుగానే..ఆరు నెలల్లోనే తనలోకి పాలకుడు ఎలా ఉంటాడో బయట ప్రపంచానికి చూపించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మూడు నెలల్లోనే గాంధీ జీ కలల గ్రామస్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లేలా వలంటీర్ల వ్యవస్థను నిర్మించారు. మూడు నెలల్లోనే 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఆ వలంటీర్లే కరోనా కట్టడిలో సైనికుల వలే పని చేస్తున్నారు..సంక్షేమ పథకాలు తీసుకెళ్లడంలో వారియర్లై ముందుకు సాగుతున్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనా బలం రోజురోజుకు పెరుగుతుంది. ఒక వారం వ్యవధిలోనే సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి మూడు సంక్షేమ పథకాల కింద రూ.1908.92 కోట్లు లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో సీఎం వైయస్ జగన్ జమ చేశారు. కరోనా అని సాకులు చెప్పకుండా చెప్పిన మాట ప్రకారం డబ్బులు జమ చేశారు. పేద విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరం కాకూడదు. పేదరికం పేదల చదువులకు అడ్డు కాకూడదు. "మీరు ఏం చదువుకుంటారో చదువుకోండి ..నేను మిమ్మిల్ని చదివిస్తాను" అన్న మహానేత వైఎస్‌ఆర్ బాటలోనే ఆయన తనయుడు వైయస్ జగన్ నడుస్తున్నారు. "మిమ్మల్ని చదివించే బాధ్యత నాది "అంటూ విద్యా రంగంలో సంస్కరణలుకు సీఎం జగన్ నాంది పలికారు. "చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు నేనే ఇచ్చే ఆస్తి చదువే" అంటూ ఓ తండ్రిలా, పెద్దకొడుకులా సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. అతిపెద్ద సామాజిక మార్పుకు నాంది పలికే 'జగనన్న విద్యా దీవెన'పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ చేయడానికి సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 2020 -21 విద్యా సంవత్సరంలో మొదటి విడతగా 10,88,439 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.671.45 కోట్లు వైయస్ జగన్ ప్రభుత్వం ఏప్రిల్ 19న జమ చేసింది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1880 కోట్లు వైయస్ జగన్ ప్రభుత్వమే చెల్లించి విద్యార్ధుల పట్ల తమ బాధ్యత ఎంతటితో తెలియజేసింది. అంతేకాదు..ఇప్పటి వరకు విద్యార్ధులకు రూ.4,879. 30 కోట్లు లబ్ధి చేకూర్చింది. విద్యార్థులకు అడుగడుగునా అండగా ఉండటానికి కాలేజీల్లో ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానిక 1902 నంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే ..భవిష్యత్తులో నాణ్యమైన మానవ వనరులు తయారవుతాయనేది సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నమ్మకం. భవిష్యత్తులో ఏపీ పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చినా, ఇవ్వకపోయినా సీఎం వైయస్ జగన్ తన సంకల్పబలంతో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు నాణ్యమైన మానవ వనరులు మన రాష్ట్రం నుంచే తయారవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏపీలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తోంది. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు అని నమ్మే ముఖ్యమంత్రి ఏపీకి దొరకడం అన్నదాతల అదృష్టం. ఇప్పటికే గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్నదాతల కోసం ఆర్‌బీకే ఛానల్ తీసుకొచ్చారు. ఆర్‌బీకే ఛానల్ ద్వారా రైతులకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యం. పెట్టుబడి ఖర్చు తగ్గిస్తూ, రైతన్నలకు ఆర్ధిక వెసులబాటు కల్పించడమే లక్ష్యంగా "వైయస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం" సీఎం జగన్ తీసుకొచ్చారు. రైతులను రుణాల భారీన పడకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. 2019 -20లో పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 6,27,906 మంది రైతన్నలకు వారి పొదుపు ఖాతాల్లో నేరుగా రూ. 128.47 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఏప్రిల్ 20న జమ చేసింది. గత ప్రభుత్వం 2014 -15 నుంచి 2018 -19 వరకు పెట్టిన రూ. 1180 .66కోట్ల వడ్డీలేని రుణాల బకాయిలను వైయస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. 2019కి సంబంధించి సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన 14.27 లక్షల రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.281. 86 కోట్లు అన్నదాతల ఖాతాల్లో వేశారు. ఇప్పటి వరకు రైతన్నలకు జగన్ ప్రభుత్వం రూ.61,119 కోట్లు సాయం చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా 22 నెలల కాలంలో అన్నదాతల మీద ఈ స్థాయిలో ఖర్చు పెట్టలేదు. అన్నదాత చల్లగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆరాటం.అందుకే..రైతు ఇంట కన్నీరు రాకుండా చూసుకుంటున్నారు. అందులో భాగంగానే అన్నదాతలను ఆదుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు సీఎం జగన్. ఆడవారి కంట కన్నీరు మంచిది కాదు. ఆడవారు సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లేనా, రాష్ట్రమైనా, దేశమైనా సంతోషంగా ఉంటాయి. అందుకే..కోటి మందికిపైగా అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం చూడటానికి వరుసగా రెండో ఏడాది `వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం' సీఎం వైయస్ జగన్ అమలు చేశారు. 1,02 కోట్ల స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ రూ.1,109 కోట్లు వారి తరపున జగన్ ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. అంతేకాదు.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 87లక్షలకు పైగా అక్కచెల్లెమ్మలకు రూ.1400 కోట్లు జమ చేశారు. వైయస్ జగన్ ఇచ్చిన మాట మీద నిలబడటంతో డ్వాక్రా సహాయక సంఘాల సంఖ్య 8.71 లక్షల నుంచి 9.34 లక్షలకు పెరిగింది. అంతేకాదు..డ్వాక్రా అక్కచెల్లెమ్మల పట్ల వైయస్ జగన్ ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుంది. బ్యాంకర్లతో మాట్లాడి వడ్డీ రేట్లను 12. 50శాతం నుంచి 9.50శాతానికి తగ్గించారు. ఇప్పటి వరకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళల కోసం రూ.82,368.31 కోట్లు లబ్ధి చేకూర్చింది. "21వ శతాబ్దపు మహిళ ఏపీ నుంచే రావాలి"అన్న సీఎం జగన్ మాటలు ఆయనలోని చిత్తశుద్దిని తెలియజేస్తున్నాయి. ఇప్పటి వరకు రైతులు, మహిళలకు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్షా 43వేల487.13 కోట్లు లబ్ది చేకూర్చింది. ఈ అంకెతోనే రైతులు, మహిళల అభివృద్ధికి వైయస్ జగన్ ఎంతగా తాపత్రయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలాగా సీఎం వైయస్ జగన్ మాటలకే పరిమితం కాలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంతదూరమైనా వెళ్తున్నారు. కరోనా వెంట పడితరుముతున్నా దానికి పగ్గాలు వేస్తూనే సంక్షేమం, అభివృద్ధి రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాల ఫేక్ ప్రచారాలు పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. "ఎవరేమనుకున్నా నాకు అనవసరం ..నాకు రాష్ట్రం, ప్రజలు ముఖ్యం" అన్నట్లు వైయస్ జగన్ పాలన సాగుతోంది. ప్రజలకు పంచిన డబ్బు మార్కెట్‌లోకి వస్తుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో జీఎస్టీ రాబడి పెరిగింది. ప్రభుత్వం డబ్బులు అవినీతిపరుల జేబుల్లోకి వెళ్లకుండా ..ప్రజల జేబుల్లోకి నేరుగా వెళ్లేలా చేయడంలో సీఎం జగన్ విజయమంతమయ్యారు. అందుకే..స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతైంది. మహానేత వైయస్ఆర్ ఆలోచనలను సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారు. నీతి,నిజాయితీగా కష్టపడుతున్నారు. ప్రజలకు ఏం చెప్పారో అదే చేస్తున్నారు. అందుకే..జనం వైయస్ జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారు.