తెలుగు ప్ర‌జ‌ల సంప్ర‌దాయం ఉట్టి ప‌డేలా ఉగాది వేడుక‌లు

 సీఎం వైయ‌స్ జగన్‌ నివాసంలో ఘనంగా  వేడుకలు 
 

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పంచాంగాన్ని సీఎం వైయ‌స్ జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు.
తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. మండపంలోని గోడలకు దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి.
 కార్య‌క్ర‌మంలో మంత్రులు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, ఆర్కే రోజా, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Back to Top