మహిళ విశ్వవిద్యాలయం అభివృద్ధి కి టీటీడీ ఇతోధిక సహాయం

  నూతన భవనం, ఆడిటోరియం ప్రారంభ సభలో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

చిత్తూరు:  తిరుపతి లో మహిళలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు అయ్యిందంటే అది శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయే నని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. మహిళ విశ్వవిద్యాలయం అభివృద్ధికి టీటీడీ ఇతోధిక సహాయం అందిస్తోందని అన్నారు.   శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో నూతనంగా నిర్మించిన కెఎల్ రావు భవనాన్ని, ఆడిటోరియం,  లైవ్లీ హుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్, మెడిసినల్ ప్లాంట్ పార్క్ , సెంటర్ ఫర్ ఉమెన్  సేఫ్టీ లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మహిళ విశ్వవిద్యాలయం నిర్మాణానికి టీటీడీ 130 ఎకరాల భూమి అందించిందన్నారు. దీంతో పాటు ఏటా కోటి రూపాయల గ్రాంట్ అందిస్తోందన్నారు. రూ 20 లక్షలతో యూనివర్సిటీ ఆవరణం లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మిస్తున్నామని, ఈ ఆలయం త్వరలో భక్తులకు, విద్యార్థినులకు అందుబాటులోకి వస్తుందని ఛైర్మన్ సుబ్బారెడ్డి వివరించారు.

 సృష్టికి మూలం స్త్రీ,
స్త్రీ లేకుండా స‌మాజం లేదన్నారు. సంపూర్ణ ప్రేమ త‌త్వంలో ఆమె " శ‌క్తి " గా అవ‌త‌రించిందని చెప్పారు.     అలాంటి స్త్రీ మూర్తులంద‌రికి సంపూర్ణంగా, నిండుగా విద్య‌ను అందిస్తూ, స‌మాజ ఉన్న‌తికి, తోడ్ప‌డుతున్న శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ప్రొ. జ‌మున‌ రిజిస్ట్రార్ ప్రొ. మ‌మ‌త‌, ఇత‌ర అధ్యాప‌కులు, సిబ్బందిని అభినందించారు.    ఇంజినీరింగ్ క‌ళాశాల‌లోని భ‌వన‌ స‌ముదాయంలో త‌ర‌గ‌తి గ‌దులు,  ఆడిటోరియం ప్రారంభించ‌డం అభినంద‌నీయమన్నారు.
   500 మంది విద్యార్థినులు కూర్చున గ‌లిగే స‌దుపాయాల‌తో ఈ ఆడిటోరియం నిర్మించారని చెప్పారు. గత రెండున్నర సంవత్సరాలుగా విశ్వవిద్యాలయం ఎంతో అభివృద్ధి చెందు తోందన్నారు. దేశంలో ఇది రెండవ మహిళ విశ్వవిద్యాలయమని ఆయన చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని చెప్పారు.   మారుతున్న కాలానికి త‌గిన విధంగా విద్యార్థుల అవ‌స‌రాలకు అనుగుణంగా ఆడిటోరియం కు రూప‌క‌ల్ప‌న చేసిన శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ విశ్వ‌విద్యాల‌యం ప‌రిపాల‌న విభాగాన్ని శ్రీ సుబ్బారెడ్డి అభినందించారు.

 భార‌త ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు రూ. 98.8 ల‌క్షలు మంజూరు చేసిందని తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా 600 మంది విద్యార్థుల‌కు  సంవ‌త్స‌రం పాటు నైపుణ్య శిక్ష‌ణ ఇస్తారని, త‌ద్వారా వారు సొంతంగా ఉపాధిని పొంద‌డం దీని ముఖ్య ఉద్ధేశమని ఆయన తెలిపారు  
   ఇందులో విద్యార్థినుల‌తో పాటు, ఇత‌ర మ‌హిళ‌ల‌కు బేకరీ ఉత్పత్తుల త‌యారీ,  పుట్టగొడుగుల పెంప‌కం, ఎంబ్రాయిడ‌రీ, సాంప్ర‌దాయ ఆహార ప‌దార్థాలు త‌యారు చేయ‌డం నేర్పించడం సంతోషకరమని చెప్పారు. శిక్షణ అనంతరం వీరు ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధి మార్గాలు ప్రారంభిచుకునే వీలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
అదే విధంగా నేష‌న‌ల్ మెడిసనల్ ప్లాంట్ బోర్డు ,    భార‌త ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖవారిచే ఆమోదించ‌బ‌డిన వివిధ ఔష‌ద గుణ‌ములు ఉన్న మొక్క‌ల స‌మ్మేళ‌నంతో ఏర్పాటు చేసిన హెర్భ‌ల్ ప్లాంట్ గార్డెన్, మెడిసిన‌ల్ బ‌యోడైవ‌ర్సిటి పార్క్ కూడా ప్రారంభించ‌డం సంతోషకరని చెప్పారు.

       శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ‌ విశ్వ‌విద్యాల‌యం మ‌రియు ఆంధ్ర ప్ర‌దేశ్ పోలీస్ శాఖ‌ సంయుక్తంగా " స్త్రీ ర‌క్ష‌ణ "  కు జ‌న‌వ‌రి - 2021న ఈ - సెంట‌ర్ ఏర్పాటుకు రూప‌క‌ల్ప‌న చేశారన్నారు.  ఇందులో స్త్రీ ర‌క్ష‌ణ‌,   స్త్రీల‌పై హింస‌ను అరిక‌ట్ట‌డానికి సంబంధించిన చ‌ట్టాలపై అవగాహన కల్పించడం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు.  ఇలాంటి చక్కటి కార్యక్రమాల నిర్వహణలో యూనివర్సిటీ మరింత ముందుకు సాగాలని శ్రీ సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.

      యూనివర్సిటీ ఉపకులపతి  ఆచార్య జమున, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మమత, స్విమ్స్ దీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెంగమ్మ,  ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణడైరెక్టర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజి ప్రొఫెసర్ రామకృష్ణ ,డీన్ ప్రొఫెసర్ నాగరాజు, ఈ ఈ శ్రీ శ్రీనివాసులు, ప్రొఫెసర్ జీవన జ్యోతి, ప్రొఫెసర్ సుజాత, డాక్టర్ రజని,  పిఆర్వో ప్రొఫెసర్ రజని, ప్రొఫెసర్ ద్వారం లక్ష్మి పాల్గొన్నారు.

Back to Top