ఎన్నిక‌ల హామీల‌న్నీ ఏడాదిలోనే సీఎం పూర్తి చేశారు

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి
 

తూర్పు గోదావ‌రి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల హామీల‌ను ఏడాదిలోనే పూర్తి చేశార‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..పేద‌ల సొంతింటి క‌ల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెర‌వేర్చార‌ని చెప్పారు. దేశంలోనే ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మం ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్నారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 500 నూత‌న దేవాల‌యాలు నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. క‌శ్మీర్‌, అయోధ్య‌, కాశీలో వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య నిర్మాణానికి  ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. గుడికో గోమాత కార్య‌క్ర‌మం దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతుంద‌ని వైవీ సుబ్బారెడ్డి వివ‌రించారు. 

Back to Top