తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత వైయస్ఆర్ చిత్రపటానికి వైయస్ఆర్‌సీపీ నేతలు పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. వైయస్ఆర్ సేవలను పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్. మాజీ మంత్రి: – చనిపోయి 15ఏళ్లు గడిచినా సరే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసిన మహానేత వైయస్‌ఆర్. ప్రతి ఒక్కరికి చదువు, ఆరోగ్యం ముఖ్యమని ఆ దిశగా పరిపాలన సాగించారు. ఇంకా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని భావించి, ఆ సదుపాయం కూడా కల్పించారు. పేద పిల్లల చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పించిన ఒక గొప్ప ఉన్నతాశయం ఉన్న నాయకుడు. 2014–19 మధ్య కాలంలో వైయస్‌ఆర్ పాలనకు తూట్లు పొడస్తూ. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను నీరుగారుస్తూ, ప్రజలను మోసం చేసేలా చంద్రబాబు పరిపాలన సాగింది. ఆ తర్వాత రాష్ట్రానికి సీఎం అయిన జగన్‌గారు వైయస్‌ఆర్ పథకాలను కొనసాగించారు. ప్రతీది గొప్పగా చేసి చూపారు. ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులను చేర్చి ప్రతి ఒక్కరికి వైద్యం అందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 32 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందించారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వైయస్ఆర్‌సీపీ ఆశయాలు, ఆలోచన విధానం, జగన్ గారి విధానాలు అన్నీ వైయస్‌ఆర్ బాటలోనే నడుస్తున్నాయి. మెరుగు నాగార్జున. మాజీ మంత్రి: – పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీనవర్గాలకు అండగా, దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక గొప్ప అధ్యాయాన్ని çసృష్టించుకున్న మహనీయుడు వైయస్ఆర్ . రాజకీయాలు అంటే ఇలా ఉండాలి. ఏ రాజకీయ నాయకుడైనా ఇలా చేస్తే బాగుంటుంది, అని అందరు నాయకులకు ఆదర్శంగా నిలుస్తూ, ప్రజలను గుండెల్లో పెట్టుకుని పాలన సాగించిన మహనీయుడు వైయస్‌ఆర్. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాలరాస్తే.. ఆయనను జ్ఞప్తికి తెచ్చుకునే వీలు లేకుండా చేయాలని చూస్తే.. వైయస్ జగన్ సీఎం అయ్యాక, తండ్రి ఆశయాలను పుణికి పుచ్చుకుని పరిపాలన సాగించారు. అలాంటి గొప్ప కార్యక్రమాలు అప్పుడు రాష్ట్రంలో జరిగితే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసింది. అందుకే ప్రజల్లో ఆలోచన మొదలైంది. అతి తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. మల్లాది విష్ణు. మాజీ ఎమ్మెల్యే: – రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన నాయకుడు, బహుముఖంగా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి. డాక్టర్‌గా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించి, ప్రజలకు సేవ చేయాలన్న బలమైన, తపన, ఆరాటంతో రాజకీయాల్లోకి వచ్చి, సుదీర్ఘకాలం ప్రజల్లో నిల్చారు. రెండుసార్లు సీఎం అయ్యారు. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షాన నిల్చారు. అందుకే ఆయన అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనతో కలిసి పని చేయడం నిజంగా నా అదృష్టం. ఎందరికో స్ఫూర్తిప్రదాత అయిన వైయస్ఆర్ బాటలో మనమంతా నడవాలి. ఆయన పోరాట పటిమ స్ఫూర్తిగా ఈ 5 ఏళ్లు మనందరం కలిసి పని చేయాలి.