అంబేద్కర్ ఆలోచనావిధానంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

 వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ర్ట మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, గురుమూర్తి, శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ఎస్సి సెల్ రాష్ర్ట అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు. 

తాడేప‌ల్లి: అంబేద్కర్ ఆలోచనావిధానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచదేశాలలో భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో  అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ర్ట మంత్రి మేరుగ నాగార్జున,ఎంపీలు నందిగం సురేష్,గురుమూర్తి,శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి,పార్టీ ఎస్సి సెల్ రాష్ర్ట అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావులతోపాటు పలువురు పార్టీ నేతలు అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

     ఈ సందర్బంగా రాష్ర్టమంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. భారతదేశంలో అంబేద్కర్ సూచించినమార్గాన్ని పరిపాలనకు సంబంధించి అన్ని అంశాలలో అమలుచేస్తున్న ముఖ్యమంత్రి  వైయస్ జగన్ అని అన్నారు. రాజకీయపార్టీలు అంబేద్కర్ వర్దంతి, జయంతి ల సందర్భంగా ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి అంతటితో సరిపుచ్చుతారని ఆయన పేదరికాన్ని పారదోలేందుకు, సమానత్వం సాధించేందుకు సూచించిన మార్గాలను అనుసరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తాయని అన్నారు. నేడు మంత్రివర్గంలో కాని,ఇతర పదవులలోకాని,అమలుచేస్తున్న పధకాలలోగాని సమానత్వం సాధించేదిశగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న వ్యక్తి  వైయస్ జగన్ అని అన్నారు. చంద్రబాబులాంటి వ్యక్తులు అంబేద్కర్ ఆశయాలకు తిలోదకాలు ఇస్తూ పరిపాలన సాగించారన్నారు. అంబేద్కర్ అంటరానితనం వంటి వాటిని ఎదురొడ్డి నిలిచి ప్రపంచ మేధావిగా ఎదగగలిగారన్నారు.

         పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ మాట్లాడుతూ ..అంబేద్కర్ దూరదృష్టి,ఆలోచనల వల్ల భారతదేశం ప్రపంచంలో గొప్పస్దాయిలో నిలబడగలిగిందని అన్నారు.అంబేద్కర్ ప్రతి ఒక్కరిలో జీవించే ఉన్నారని అన్నారు.దేశంలో అంబేద్కర్ ఇజాన్ని అనుసరిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి   వైయస్ జగన్ అని అన్నారు.ప్రతి పేదవాడి కుటుంబం అభివృద్ది చెందాలనే తపనతో బడుగు,బలహీనవర్గాలకోసం అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని అన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూల్స్ ను అబివృధ్ది చేసి పేదల పిల్లలు మంచి విద్య అభ్యసించాలని తద్వారా వారు ప్రపంచస్దాయి విద్యార్దులుగా రూపొందాలని భావించారన్నారు.అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న వైయ‌స్ జగన్ గారిని చంద్రబాబు లాంటి వారు విమర్శిస్తున్నారని వారందరికి బుధ్ది చెప్పేవిధంగా 2024లో జగన్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. చంద్రబాబు హయాంలో అంబేద్కర్ విగ్రహాన్ని వర్షం వస్తే మునిగిపోయే నేలపాడు,శాఖమూరు వంటి ప్రాంతాలలో ఏర్పాటుచేయాలని బావించారన్నారు. నేడు జగనన్న విజయవాడ నడిబొడ్డున వందలకోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారన్నారు. చంద్రబాబు తిరిగి వస్తే పేద పిల్లల చదువులు ఆగిపోతాయన్నారు.ఉద్యోగాలు రావన్నారు.

       పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి మాట్లాడుతూ భారతదేశంలో అంబేద్కర్ ఆలోచనలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మాత్రమే అన్నారు. పేద,ధనిక పిల్లల తారతమ్యం లేకుండా విద్యను అందించేలా విద్యావ్యవస్దను జగన్ తీర్చిదిద్దారని తెలియచేశారు.సమానత్వాన్ని దృష్టిలో ఉంచుకునే అంబేద్కర్ వివిధ దేశాలలో అధ్యయనం చేసి భారతదేశ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని వివరించారు.
    
       శాసనమండలిలో విప్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ విభిన్నమతాలు,జాతులు ఉన్న భారతదేశంలో అందరూ ప్రశాంతంగా జీవించగలుగుతున్నారంటే దానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణం అని అన్నారు.భారతదేశానికి అది ఒక పవిత్రగ్రంధంతో సమానం అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుస్తూ పేదరికాన్ని తొలగించడమే కాకుండా ఎస్సి,ఎస్టి, బిసి,  మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలియచేశారు.

      పార్టీ ఎస్సి సెల్ రాష్ర్ట అద్యక్షుడు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ..  సమసమాజ స్దాపనకోసం అంబేద్కర్ ఆలోచించారన్నారు. అంబేద్కర్ ఆలోచనావిధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో  వైయస్ జగన్ గారు అభివృధ్దిని - సంక్షేమాన్ని మేళవించి ముందుకు వెళ్తున్నారన్నారు. జగన్ గారు అనుసరిస్తున్న విధానం భావితరాలకు మేలు చేసే రాచబాటను నిర్మిస్తోేందని వివరించారు.

    కార్యక్రమంలో ఎస్సి కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ,పార్టీ అధికారప్రతినిధులు కాకుమాను రాజశేఖర్,నారమల్లి పద్మజ,వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ రాజ్ ,st విభాగం అధ్యక్షుడు హనుమంతనాయక్ పలువురు కార్పోరేషన్ ఛైర్మన్లు,డైరక్టర్లు, పార్టీనేతలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top