కాసేపట్లో టూరిజం కంట్రోల్‌ రూమ్‌ల ప్రారంభం

తాడేపల్లి: టూరిజం కంట్రోల్‌ రూమ్‌లను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేప‌ట్లో ప్రారంభించనున్నారు. నదీ తీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ కోసం కంట్రోల్‌ రూమ్‌లను రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 9 కంట్రోల్‌ రూమ్‌లను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 
 

Back to Top