నేడు జంగా కృష్ణ‌మూర్తి నామినేష‌న్‌

అమ‌రావ‌తి:  శాసన సభ్యుల కోటాలో తమకు దక్కే ఏకైక ఎమ్మెల్సీ పదవిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  బీసీ నేతకే కేటాయించారు.  వైయ‌స్ఆర్‌సీపీ బీసీ  అధ్యయన కమిటీ చైర్మన్ గా ఉన్న జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని వైయ‌స్ జ‌గ‌న్  ఖరారు చేశారు. ఇవాళ జంగా కృష్ణమూర్తి  ఎమ్మెల్సీ ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. రెండు రోజుల క్రితం  జంగా కృష్ణమూర్తికి   ఎంపీ వి.విజయసాయి రెడ్డి బీఫారాన్ని అందించారు.  
 
ఏపీ శాసనమండలిలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ పదవులకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండగా.. వైయ‌స్ఆర్‌సీపీ  కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది. ఈ ఎన్నికలకు నామినేషన్ల చివరి తేదీ ఈ నెల ఇరవై ఎనిమిది కాగా..ఫలితాలను మార్చి పదిహేనున ప్రకటిస్తారు.  

Back to Top