24న వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్ధాయి సమావేశం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన ఈ నెల 24న (బుధవారం) ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృతస్ధాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రీజినల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు)ను ఆహ్వానించారు. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైయ‌స్ జ‌గ‌న్ చర్చించనున్నారు.

Back to Top