నేడు విశాఖ‌కు వైయ‌స్  జగన్‌మోహ‌న్‌రెడ్డి

నూతన వధూవరులకు ఆశీర్వాదం

బొత్స అప్పలనరసయ్య కుమార్తె వివాహ వేడుకకు హాజరు
 

విశాఖపట్నం:  వైయ‌స్ఆర్‌సీపీ  అధ్య‌క్షులు,రాష్ట్ర  ప్రతిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి నేడు విశాఖకు రానున్నారు. నగరంలో జరుగనున్న వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని, విశాఖ నగరానికి చెందిన మునికోటి నిరంజనరావు, విజయలక్ష్మిల కుమారుడు రవితేజల వివాహానికి హాజరవుతారు. శనివారం రుషికొండ సమీపంలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి  విమానంలో బయల్దేరి శనివారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రుషికొండ సాయిప్రియా రిసార్ట్స్‌కు వెళతారు. వేడుకల్లో పాల్గొన్న అనంతరం అదే రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వెళతారు.

Back to Top