బాస్కెట్‌బాల్ అసోసియేష‌న్ చైర్మ‌న్‌గా విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి  ఆంధ‌ప్ర‌దేశ్ బాస్కెట్ బాల్ అసోసియేష‌న్ చైర్మ‌న్‌గా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  ప‌లువురు విజ‌య‌సాయిరెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచిన ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.  బాస్కెట్‌బాల్‌ను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటిగా మార్చడానికి, గొప్ప ఆటగాళ్లను తయారు చేయడానికి నేను దీనిని ఒక బాధ్యతగా, సవాలుగా తీసుకుంటాను అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top