నూత‌న కేబినెట్ ప్ర‌మాణ‌స్వీకారానికి ముహూర్తం ఖ‌రారు

పాత‌, కొత్త మంత్రుల‌కు సీఎం, గ‌వ‌ర్న‌ర్ తేనేటి విందు

తాడేప‌ల్లి: నూతన కేబినెట్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 11వ తేదీన ఉదయం 11.31 గంట‌ల‌కు నూత‌న మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో పాత, కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తేనీటి విందులో పాల్గొననున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మ‌న్లు,  అధికారులకు నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్య‌క్ర‌మ ఆహ్వానాలు పంపిణీ జ‌రుగుతోంది. Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాసులు జారీ చేస్తున్నారు. 

Back to Top