మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు మూడో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. ముందుగా ప్ర‌శ్నోత్త‌రాలు జ‌రుగుతున్నాయి.  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేం­ద్రనాథ్‌ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉద­యం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించను­న్నారు. శాసన మండలిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా బడ్జెట్‌ను చదవనున్నారు. వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్త­యిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదవనున్నారు.

Back to Top