అందరం కలిసి పని చేస్తాం

ఎంపీ మిథున్‌రెడ్డి

రీజినల్‌ కో–ఆర్డినేటర్‌గా నియమించినందుకు సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు

తిరుపతి: ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీలోని సీనియర్లతో కలిసి పని చేస్తామని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌గా తనను నియమించడం పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్‌ నాయకుడు, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి పని చేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. 
 

Back to Top