వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా టీచ‌ర్స్ డే వేడుక‌

తాడేప‌ల్లి: మాజీ రాష్ట్ర‌ప‌తి, భార‌త‌ర‌త్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 133వ జయంతిని పుర‌స్క‌రించుకొని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డాక్ట‌ర్‌ స‌ర్వేప‌ల్లి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. దేశానికి ఆయ‌న అందించిన సేవ‌ల‌ను గుర్తుచేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణ మూర్తి, పార్టీ నేతలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top