రాష్ట్రంలో పాజిటివ్ కేసుల శాతం తగ్గింది

  రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు 

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

తూర్పు గోదావ‌రి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలిస్తున్నాయ‌ని, రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ శాతం త‌గ్గింద‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. పాజిటివ్ లెక్కల ప్రకారం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. 44 శాతం నుంచి 35 శాతానికి కరోనా కేసులు తగ్గాయని చెప్పారు. కరోనాను కట్టడి చేయడంలో ఏపీలోని ప్రభుత్వం విఫలమయిందని టీడీపీ నేతలు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఖండించారు.  కర్నూలులో కొత్త వైరస్ అంటూ చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 

కరోనాపై రాజకీయం చేయవద్దని టీడీపీ నేతలకు మంత్రి సూచించారు.  రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని చెప్పారు. వీలైతే ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని సూచించారు. ఆక్సిజన్ కొరత లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. ట్విట్టర్ లో తప్పుడు పోస్టులు చేయడాన్ని నారా లోకేశ్ మానుకోవాని మంత్రి హిత‌వు ప‌లికారు. 

Back to Top