టీడీపీ నేతల దౌర్జన్యం

 వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై దాడి

మ‌హిళ‌కు తీవ్ర గాయాలు 

అనంతపురం:  టీడీపీ నాయకులు తమకు సంబంధంలేని విషయంలో జోక్యం చేసుకోవడమేగాక వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులపై దాడి చేసిన ఘటన కంబదూరు మండలం సీవీ తండా(చెవిటి వంక తండా)లో చోటు చేసుకుంది. బాధితురాలు గౌరీబాయి వివరాల మేరకు...సీవీతండాకు చెందిన గౌరీబాయి, సోమునాయక్‌లు  వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులు. కడదరకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ప్రతి చిన్న విషయానికి వీరితో తగవు పడేవారు. ఈ క్రమంలో గతంలో పొట్టేళ్ల విషయంలో జరిగిన వివాదాన్ని గౌరీబాయి, సోమునాయక్‌పై రుద్ది వారి బంధువుల మధ్య తగువుపెట్టేందుకు ప్రయత్నించారు. దీనిపై ఇటీవల గౌరీబాయి టీడీపీ నాయకుడు సర్ధానప్పను ప్రశ్నించారు. దీన్ని మనసులో పెట్టుకున్న సర్దానప్ప, మణికంఠ, రాకేష్, సునీత, రామాంజి, వన్నూరుస్వామి బుధవారం  సోమునాయక్‌ ఇంట్లోలేని విషయాన్ని గమనించి గౌరిబాయితో గొడవకు దిగారు. ఈక్రమంలో ఆమెపై దాడికి దిగారు. కిందపడవేసి కాళ్లతో తొక్కడంతో కుడికాలు, కుడి చేయి, నడుముకు దెబ్బలు తగిలాయి. లేవలేనిస్థితిలో ఉన్న ఆమెను బంధువులు కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీడీపీ నాయకులు మరోసారి ఇంటికి వచ్చి బెదరించి వెళ్లారు. టీడీపీ నాయకులు దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇక తమకు ఆత్మహత్య శరణ్యమని బాధితురాలు వాపోయింది.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top