వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ ముఖ్య నేత హ‌రికృష్ణ‌

అన్న‌మ‌య్య జిల్లా: గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా అమ్మ‌గారిప‌ల్లె స్టే పాయింట్ వ‌ద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో ఏ.హ‌రికృష్ణ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ఉన్నారు. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు హ‌రికృష్ణ 2019లో టీడీపీ త‌ర‌ఫున గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు.

Back to Top