కౌంటింగ్‌కు టీడీపీ ఆటంకం కలిగిస్తుంది

ముందస్తుగానే చర్యలు చేపట్టండి

కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

ఢిల్లీ: కౌంటింగ్‌కు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉన్నాయని, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. టీడీపీ ఏజెంట్లు నకిలీ ఫాం 17 తీసుకువచ్చే అవకాశం ఉందని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు అబ్జర్వర్లు కౌంటింగ్‌ హాల్‌లోనే ఉండేలా చూడాలని, కౌంటింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియను ముందుగానే పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లకు ఆటంకాలు సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్ర పన్నుతున్నారని, కౌంటింగ్‌ ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అదే విధంగా ఈవీఎంల వద్ద స్టీల్‌ బారికేడ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. ఏపీ పోలీసులపై టీడీపీ ఒత్తిడి చేసే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజయసాయిరెడ్డి కోరారు. 

 

Back to Top