జగనన్న ప్రజాదరణ చూసి కూట‌మి నేత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు 

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌నే భయంతో అక్రమ కేసుల పర్వం

కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి ఫైర్‌

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు  మీడియాతో మాట్లాడారు

ఏపీలో అంబేద్క‌ర్ రాజ్యాంగం బ‌దులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమ‌లు

కూటమికి ఒక రాజ్యాంగం, వైయ‌స్ఆర్‌సీపీకి మరో రాజ్యాంగం ఉంటుందా?

జంతు బలులు నిషేధమైతే అందరికీ వర్తించే ఒకే రూల్ తీసుకురావాలి

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కార్యక్రమాలపై మాట్లాడని హోం మంత్రి, జగనన్నపై ఎందుకు ద్వేషం?

ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి సూటి ప్ర‌శ్న‌

హోం శాఖ పనితీరు 36వ స్థానానికి పడిపోవ‌డానికి మంత్రి అనిత అస‌మ‌ర్ధ‌తే కార‌ణం 

ద‌మ్ముంటే కుప్పం, పిఠాపురం, నెల్లూరు ఘటనలపై నిందితులను అరెస్టు చేయండి

హోం మంత్రికి ఎమ్మెల్సీ వ‌రుదు కళ్యాణి స‌వాల్‌

అక్రమ కేసులతో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను భయపెట్టలేరు

మీరు సెంటీమీటర్ చేస్తే..మేం కిలోమీటర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం 

కూట‌మి ప్ర‌భుత్వానికి వ‌రుదు క‌ళ్యాణి వార్నింగ్ 

టీడీపీ, ఐటీడీపీ ట్రోలింగ్ వల్ల నాడు తెనాలిలో యువ‌తి ఆత్మహత్య 

కదిరి ఘటనలో నిందితుడు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త కాదని జనసేన నేతలే స్పష్టం చేశారు

తల్లి, చెల్లి పేరుతో జగనన్నపై తప్పుడు ప్రచారం:  వరుదు కళ్యాణి ఆగ్రహం

చంద్రబాబు తన తల్లి, చెల్లెల్లకు ఇచ్చిన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా?

ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం

ప్రజలే జగనన్న మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు

ఎన్ని కేసులు పెట్టినా వైయ‌స్ఆర్‌సీపీభయపడదు

రాబోయేది ఖచ్చితంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే

దీమా వ్య‌క్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి 

తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు, పార్టీ శ్రేణులు పండుగ‌లా జ‌రుపుకున్నార‌ని, ఆయ‌న‌కు వ‌చ్చిన‌ ప్రజాదరణ చూసి కూటమి నేతలు కడుపు మంటతో ర‌గిలిపోతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి  మండిప‌డ్డారు. మ‌ళ్లీ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌నే భ‌యంతో మా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.   తమ అభిమాన నాయకుడిపై  ఒక్కొక్క‌రు ఒక విధ‌గా అభిమానం చూపుతుంటార‌ని, జ‌గ‌న‌న్న పుట్టిన రోజు సంద‌ర్భంగా జంతు బలి చేస్తే త‌ప్పైందా అని ప్ర‌శ్నించారు.  బాలకృష్ణ సినిమా రిలీజ్‌ సమయంలో జంతు బలి ఇవ్వలేదా, ప‌వ‌న్ క‌ళ్యాణి సినిమా ఫ్రీ రిలీజ్ పంక్ష‌న్‌లో క‌త్తులు ఊపించ‌లేదా..?. అప్పుడేందుకు ఈ హోం మంత్రి మాట్లాడలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నార‌ని, వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక వీరికి త‌ప్ప‌కుండా రిట‌ర్న్ గిప్ట్  ఇస్తామ‌ని  వరుదు కళ్యాణి హెచ్చ‌రించారు.  తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శ‌నివారం వ‌రుదు క‌ళ్యాణి మీడియాతో మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లో వ‌రుదు క‌ళ్యాణి ఏమ‌న్నారంటే.. 

ప్ర‌జాద‌ర‌ణ చూసి ఓర్వ‌లేక అక్ర‌మ కేసులు
ఈ నెల 21న వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. ఒక ఇంట్లో తమ బిడ్డ పుట్టిన రోజు ఎలా జరుపుకుంటారో, అలాగే ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో జగనన్న పుట్టిన రోజు సంబరాలు నిర్వహించారు. ఈ ప్రజాదరణను చూసి కూటమి నేతలు తట్టుకోలేక, ముఖ్యమంత్రి, డీజీపీ, హోం మంత్రి కలిసి రివ్యూలు పెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఘన విజయం సాధించబోతోందన్న భయంతోనే ఈ కక్షసాధింపు చర్యలు. కూటమి ప్రభుత్వం తుక్కు తుక్కుగా ఓడిపోబోతుందన్న నిజం తెలిసే హోం మంత్రి తన అక్కస్సును ఈ విధంగా వెల్లగక్కారు. 

అంద‌రికీ ఒకే రూల్ ఉండాలి
జగనన్న పుట్టిన రోజు వేడుకల్లో కొన్ని చోట్ల జంతు బలి ఇచ్చారంటూ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితం. ప్రతి ఒక్కరూ తమ అభిమాన నాయకుడిపై తమకు నచ్చిన విధంగా అభిమానం చూపిస్తారు, అందులో తప్పేముంది?. బాలకృష్ణ సినిమా విడుదల సమయంలో జరిగిన ఘటనలపై, పవన్ కళ్యాణ్ సినిమా రీ రిలీజ్ కార్యక్రమాల్లో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలపై అప్పట్లో హోం మంత్రి ఎందుకు మాట్లాడలేదు. మీకో న్యాయం, మాకో న్యాయమా? రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కో రాజ్యాంగమా? ఉంటుందా? కూటమికి ఒక రాజ్యాంగం, వైయ‌స్ఆర్‌సీపీకి మరో రాజ్యాంగమా? . నిజంగా జంతు బలులు నిషేధమైతే అందరికీ వర్తించేలా ఒకే రూల్ తీసుకురావాలి. అక్రమ కేసులు పెట్టేందుకు, కక్షసాధింపులకు పుట్టిన రోజు వేడుకలను సాకుగా చూపించడం ఎంత వరకు సమంజసం. హోం మంత్రి ‘ఇక్కడ ఉన్నది సీబీఎన్’ అంటూ బెదిరింపుల ధోరణిలో మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మీరు ఎంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీఅధికారంలోకి రావడం ఖాయం.  ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదు. మీరు మాపై సెంటీమీటర్ చేస్తే, మేము కిలోమీటర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న‌ది గుర్తు పెట్టుకోండి. హోం మంత్రి తన బాధ్యతలు నిర్వర్తించకుండా కేవలం జగనన్నను విమర్శించడానికే పరిమితమయ్యారు.

మీకు ద‌మ్ముంటే ఆ నిందితుల‌ను న‌డిరోడ్డుపై న‌డిపించండి
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణ ఘటనలపై హోం శాఖ పూర్తిగా విఫలమైంది. కుప్పంలో వివాహితపై జరిగిన అత్యాచారం, నెల్లూరులో టీడీపీ కార్యకర్తల రౌడీయిజం, పిఠాపురంలో మహిళపై జరిగిన దాడి వంటి ఘటనలపై హోం మంత్రి చ‌ర్య‌లు తీసుకునే విష‌యంపై దృష్టి పెట్టాలి. నిజంగా దమ్ముంటే టీడీపీకి చెందిన‌ నిందితులను నడిరోడ్డుపై న‌డిపించి అరెస్టు చేసి శిక్షించాలి. నాడు జ‌గ‌న‌న్న ఇంటి ప‌ట్టా ఇస్తే ఆనందం వ్య‌క్త‌ప‌రిచిన తెనాలికి చెందిన గీతాంజ‌లిని టీడీపీ, ఐటీడీపీ కార్యకర్తలు ట్రోలింగ్ చేయ‌డంతో ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లలు కూడా వైయస్‌ జగన్‌పై అభిమానం చూపితే వారి కుటుంబాలను టార్గెట్ చేసి వేధించిన చరిత్ర టీడీపీదే. కదిరి ఘటనలో నిందితుడు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త కాదని స్వయంగా జనసేన నాయకులే చెప్పారు. 

హెరిటేజ్‌లో ఎంత వాటా ఇచ్చారో చెప్పండి
హోం మంత్రి నోరు తెరిస్తే తల్లి, చెల్లి అంటూ వైయస్‌ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు తన తల్లి, చెల్లెల్లకు ఎంత ఆస్తి ఇచ్చారో, హెరిటేజ్‌లో ఎంత వాటా ఇచ్చారో బహిరంగంగా చెప్పేందుకు అనిత సిద్ధమా?రు. ఆధారాలు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. 
ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన‌ హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదు. అందుకే ప్రజలు జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆయన పుట్టిన రోజును పండుగలా జరుపుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో కూడా వైయస్‌ జగన్ తిరిగి అధికారంలోకి రాబోతున్నారని స్పష్ట‌మైంది. వాస్త‌వాన్ని జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం అక్రమ కేసులకు పాల్పడుతోంది.

హోంశాఖ ర్యాంకింగ్‌పై దృష్టి పెట్టండి
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి.  కేంద్రం ఇచ్చిన హోం శాఖ 36వ ర్యాంకును మెరుగుపర్చడంపై హోం మంత్రి దృష్టి పెట్టాలి. గతంలో వైయస్‌ జగన్ పాలనలో ఎమర్జెన్సీ కాల్‌కు 3–5 నిమిషాల్లో స్పందన ఉండేది, నేడు పరిస్థితి దారుణంగా ఉంద‌ని స్వ‌యంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెచ్చ‌రిస్తూ సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాశారు. మహిళల భద్రత, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం.

చివ‌రిగా..
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఇంచు కూడా భయపడరు, రాబోయేది ఖచ్చితంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని వ‌రుదు క‌ళ్యాణి ధీమా వ్యక్తం చేశారు. మరోసారి జగనన్న పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చూపిస్తామని ఆమె పేర్కొన్నారు.

Back to Top