మైనింగ్ పై బాబువి చౌకబారు ఆరోపణలు

రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన శాఖల మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి 

 రుషికొండలో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగలేదు

  కుప్పంలో ఆ లీజులిచ్చింది బాబే..

  బాబు సీఎంగా ఉన్న 14 ఏళ్ళలో ఏనాడైనా మైనింగ్ శాఖకు అవార్డు వచ్చిందా..?

 మా హయాంలో మైనింగ్ రంగంలో జాతీయస్థాయిలో ఏపీకి 3వ ర్యాంకు

  మీ హయాంలో ఇసుక దోపిడీపై ఎన్జీటీ రూ. 100 కోట్లు జరిమానా వేసింది మరిచారా బాబూ..?

 సిమెంట్ తయారీలో కేవలం 3 శాతం మాత్రమే లేటరైట్ వినియోగిస్తారు

 మరి, భారతీ సిమెంట్ రోజుకు 1000 లారీల లేటరైట్ ఎందుకు కొనుగోలు చేస్తుంది..?- ఇదీ బాబు గారి అవగాహన

  2014-19 మధ్య లేటరైట్ తవ్వకుండానే సిమెంటు పరిశ్రమలు నడిచాయా బాబూ..?

  మామను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడుకానీ, ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా బాబుకు లేదు

తిరుప‌తి:  మైనింగ్ పై చంద్ర‌బాబువి చౌకబారు ఆరోపణల‌ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన శాఖల మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టిపారేశారు. రుషికొండలో నిర్మాణాలు చేపట్టకూడదంటూ కోర్టుకు వెళ్లింది కూడా ఆయనే. రుషికొండలో నిబంధనల మేరకే పనులు జరిగాయన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

 బాబు పెంచి పోషించిన మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేశాం..
            చంద్రబాబు నాయుడు హయాంలో పెంచి పోషించిన మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తూ,  మా ప్రభుత్వం పలు సంస్కరణలు చేప్టటి, తత్ఫలితంగా  మైనింగ్ శాఖకు దేశంలోనే మూడవ బెస్ట్ ర్యాంకు సాధిస్తే.. రాష్ట్రంలో కొండల్ని, చెరువులను తవ్వేస్తున్నారంటూ  ఆరోపణలు చేయడం విడ్డూరం.  చంద్రబాబు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనే మీడియా ముందుకు రావడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రుషి కొండలో ఎటువంటి అక్రమాలు జరగలేదు. పర్యావరణ అనుమతులు ఇచ్చిన ప్రకారమే అక్కడ మట్టి తవ్వకాలు జరిగాయి. ప్రభుత్వానికి ఆ సంస్థ రూ.6 కోట్లు రాయిల్టీ కూడా చెల్లించింది. అసలు చంద్రబాబు రుషికొండ ఎందుకు పోవాల్సి వచ్చింది.  రుషికొండలో నిర్మాణాలు చేపట్టకూడదంటూ కోర్టుకు వెళ్లింది కూడా ఆయనే. రుషికొండలో నిబంధనల మేరకే పనులు జరిగాయి. నిర్దేశిత స్థలం కంటే ఎక్కువ మొత్తంలో తవ్వకాలు జరిగాయన్న అంశం కోర్టు పరిధిలో ఉంది. గోరంతలు కొండంతలు చేసి చెప్పడం చంద్రబాబు నాయుడు నైజం. రుషికొండపై గతంలో అక్రమాలకు పాల్పడివారిపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకున్నాం. 

- ఎక్కడైనా అక్రమాలు జరిగాయంటే అవి చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలోనే జరిగాయి. ఫారెస్ట్‌ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్‌లు జరిగాయి. వాటిని అన్నింటిని మేం అధికారంలోకి వచ్చాక నిలుపుదల చేశాం. చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు 75 అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో.. ఆ లీజులన్నీ ఇచ్చింది గత టీడీపీ ప్రభుత్వంతో పాటు అంతకుమందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ఇచ్చినవే. 

చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాంః
    1- రోడ్ల మీద గుంతలని మీరే ప్రచారం చేస్తారు.. మెటల్ తవ్వితే మీరే ఏడుస్తారుః మెటల్ తవ్వకుండా రోడ్లు ఎలా వేస్తారు..? 
    2- ఏ సిమెంటు కంపెనీ అయినా లేటరైట్ ఉపయోగించుకుంటుంది. కాకపోతే అది కావాల్సిన మొత్తం ముడిపదార్థంలో కేవలం 3 శాతం మాత్రమే ఉంటుంది. 
    3-2014-19 మధ్య సిమెంటు కంపెనీలు- లేటరైట్ లేకుండా, చంద్రబాబు గారు వదిలేసే వ్యర్థాన్ని ఉపయోగించి ప్రొడక్షన్ చేశాయా.. ?. 
    4- మరి అప్పుడూ లేటరైట్ వాడారు కదా.. అది తవ్వితే వచ్చిందా.. లేక తవ్వకుండానే వచ్చిందా.. ?
    5- రోడ్లు వేయడానికి కంకరు ఎక్కడ నుంచి వస్తుంది. ? 
    6- ఇళ్ళు కట్టడానికి ఇసుక ఎక్కడ నుంచి వస్తుంది.. ?
    7- నింపటానికి మట్టి ఎక్కడ నుంచి వస్తుంది.. ?
    8- కట్టడానికి సిమెంటు ఎక్కడ నుంచి వస్తుంది.. ?
- ఏ ప్రభుత్వం ఉన్నా ఈ విషయాల్లో మార్పులు ఉండవు కదా.. 

కుప్పంలో ఆ లీజులిచ్చింది బాబు-కాంగ్రెస్ ప్రభుత్వాలే
        చంద్రబాబు సీఎంగా ఉన్న అయిదేళ్ళలో అటవీప్రాంతంలో దొంగచాటుగా అక్రమ మైనింగ్ జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని నిలుపుదల చేశాం.  కుప్పంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే మైనింగ్ లీజులు ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం రెండు లీజులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కార్తీక్ మాధవ్, సాయికృషా గ్రానైట్ లకు మాత్రమే లీజు అనుమతులు ఇచ్చాం. వారు కూడా తమ పరిధి దాటి మైనింగ్  చేస్తున్నారని అధికారుల తనిఖీల్లో వెల్లడి కావడంతో వాటికి కూడా నోటీసులు ఇచ్చి, మైనింగ్ ను నిలిపివేశాము. చంద్రబాబు గతంలో తనకు బినామీగా ఉన్న గౌనిగాని శ్రీనివాస్ అక్రమ మైనింగ్ కు పాల్పడిన ప్రాంతంలోనే పరిశీలన చేసి, తమపై రౌడీయిజం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు చేయడాన్ని  పూర్తిగా ఖండిస్తున్నాం. నిజంగా మేం రౌడీయిజం చేస్తే చంద్రబాబు కుప్పంలో గెలిచేవాడా? తెలుగుదేశంలోనే రౌడీయిజం చేసే వారు ఉన్నారు. 

- కుప్పం నియోజకవర్గంలో వైయస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక కేవలం రెండు లీజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. శాంతిపురం మండలంలో ముదనపల్లె, గుడిపల్లె మండలంలో కోడినాకనపల్లె. మేము లీజుకు అనుమతి ఇచ్చినా.. వాటితో మాకుగానీ, మా పార్టీ వాళ్లకుగానీ ఎటువంటి సంబంధం లేదు.

- మా హయాంలో తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదు. అక్రమ మైనింగ్ కు ఎవరు పాల్పడినా జరిమానాలు విధిస్తున్నాం. అక్రమ మైనింగ్‌ జరిపినందుకు కార్తీక్ మాథవ్ క్వారీకి రూ. 40 లక్షలు, సాయికృప క్వారీకి రూ. 4,21,038 జరిమానా విధించాం. దాంతో వారు మైనింగ్ కూడా నిలిపివేశారు. అలాగే మొత్తం 43 లీజులకు రూ.114.60 కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ లు ఇచ్చాం. వాటిలో మైనింగ్ కూడా నిలిపివేశాం. ఇలా అక్రమాలకు పాల్పడే క్వారీల్లో అధికశాతం టిడిపి హయాంలో అనుమతులు పొందినవే ఉన్నాయి. ప్రస్తుతం కుప్పంలో 31 లీజులు మాత్రమే నడుస్తున్నాయి.  వాటిని కూడా తనిఖీలు చేసి, పదిరోజుల్లో నివేదికలు ఇవ్వాలని రీజనల్ విజిలెన్స్ స్వ్కాడ్ అధికారులను ఆదేశించడం జరిగింది. 

- కాంగ్రెస్, టిడిపి హయాంలోనే  మొత్తం 71 లీజులకు అనుమతులు ఇచ్చారు. వాటిల్లో ప్రస్తుతం 31 లీజులు పనిచేస్తున్నాయి. 71 లీజులకు డిమాండ్‌ నోటీసులు ఇచ్చి నిలుపుదల చేశాం.  వారి వివరాలు అన్నీ వెల్లడిస్తున్నాం. ఈ లీజులు తీసుకున్నవారంతా మీకు సంబంధించినవారా, కాదా అనేది చంద్రబాబే చెప్పాలి.  టీడీపీ హయాంలో ఇచ్చిన 71 లీజులకు పెనాల్టీ రైజ్‌ చేశాం. ఇక వర్కింగ్‌లో ఉన్న 31 లీజులపై కూడా, తనిఖీలు చేసి, వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ అక్రమ మైనింగ్‌ జరుగుతున్నట్లు తేలితే వాటిపై కూడా చర్యలు తీసుకుంటాం. టెక్నాలజీ పెరిగిన తర్వాత శాటిలైటింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఇమేజ్‌ తీసుకుని వాటి ఆధారంగా ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటున్నాం.

బాబు హయాంలో లేటరైట్ లేకుండా సిమెంటు ఉత్తత్తి చేశారా..?
    భారతీ సిమెంట్ కు రోజూ 1000 లారీల లేటరైట్ తరలిస్తున్నారనే ఆరోపణలు అర్థరహితం. దీనినిబట్టి ఖనిజాల వినియోగంపై చంద్రబాబుకు కనీస అవగాహన కూడా లేదని అర్థమవుతోంది. సిమెంట్ తయారీలో ముడి ఖనిజాల్లో కేవలం 3 శాతమే లేటరైట్ ను వినియోగిస్తారు. భారతీ సిమెంట్ లారీల కోద్ది లేటరైట్ ను కొనుగోలు చేసి ఏం చేసుకుంటుంది? కేవలం ముఖ్యమంత్రి గారి మీద బుదర చల్లేందుకే ఇటువంటి అర్థరహితమైన ఆరోపణలు చంద్రబాబు చేస్తున్నాడు. 

- చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, 2014-19 మధ్య రాష్ట్రంలోని సిమెంటు కంపెనీలు- లేటరైట్ లేకుండా ప్రొడక్షన్ చేశాయా.. ?. ఖనిజాల గురించి చంద్రబాబుకు ఏమాత్రం నాలెడ్జ్‌ ఉందో దీనినిబట్టే అర్థం అవుతుంది. ఏవో చౌకబారు ఆరోపణలు చేసి, రాజకీయ లబ్ధి పొందాలన్న తాపత్రయం తప్ప, చంద్రబాబు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు.

మా హయాంలో రవ్వలకొండలో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగలేదు
        మా ప్రభుత్వం వచ్చిన తరువాత బ్రహ్మంగారు  కాలజ్ఞానం చెప్పిన రవ్వలకొండలో ఎటువంటి తవ్వకాలు జరగలేదు. గతంలో అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. అక్కడ ఎటువంటి అక్రమ తవ్వకాలు జరగకపోయినా..  జరిగినట్లు కాటసాని బ్రదర్స్ మైనింగ్ పేరుతో దోచేస్తున్నట్లు చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.

మీ ఇసుక దోపిడీకి ఎన్జీటీ రూ. 100 కోట్లు జరిమానా విధించి మరిచారా బాబూ..?
        చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక మాఫియాకు చెక్ పెడుతూ.. అత్యంత పారదర్శక ఇసుక విధానాన్ని తీసుకువచ్చాం. కేంద్రప్రభుత్వ సంస్థల ద్వారా ఇసుక టెండర్లు నిర్వహించాం. అక్రమ ఇసుక తవ్వకాలను పూర్తి స్థాయిలో నిరోధించాం. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఇంటి పక్కనే అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినా పట్టించుకోలేదు. కృష్ణా కరకట్ట పక్కన మీ ఇంటి కిందే కృష్ణా నదీ గర్భంలో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే చంద్రబాబు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు. దాంతో నేషనల్‌ గ్రీన్‌ ట్రబ్యునల్‌ రూ. 100 కోట్లు జరిమానా వేసింది మరిచిపోయారా బాబూ..?

- మా ప్రభుత్వం వచ్చిన తరువాత మా పారదర్శక విధానాలను పరిశీలించిన ఎన్జీటి ఆ జరిమానాను రద్దు చేసిన విషయం వాస్తవం కాదా? చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా చెలరేగిపోయింది.  మహిళా తహసిల్థార్ పై మీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏ రకంగా రౌడీయిజం చేశారో మరిచిపోయారా?. చంద్రబాబు హయాంలో నదుల్ని, చెరువుల్ని ఎలా తవ్వేశారో రాష్ట్ర ప్రజలెవరూ మరచిపోలేదు.  మట్టి, ఇసుక, మైనింగ్ మాఫియాలన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినవే కదా?

- చంద్రబాబు శాటిలైట్ ఇమేజింగ్ సిస్టం మీద అవగాహన పెంచుకోవాలి. మేం అధికారంలోకి వచ్చాక...  శాటిలైట్‌ ఇమేజింగ్‌ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఈ విధానం ద్వారా ఎక్కడైనా అక్రమాలు జరిగితే తక్షణమే గుర్తిస్తున్నాం. అక్రమాలు జరిగితే వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నాం. 

- ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ ను, రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. అంతేకాదు రాజ్యాంగంబద్దంగా ఏర్పడిన  కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (CAG) రాష్ట్రాల్లో సహజ వనరులపై ఎప్పటికప్పుడు శాటిలైట్ ఇమేజింగ్ సిస్టం ద్వారా అకౌంటింగ్ చేస్తోంది. ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే, వెంటనే ఆయా రాష్ట్రాలను ప్రశ్నిస్తుంది. ఇప్పటి వరకు కాగ్ నుంచి మన రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు లేవు. రాష్ట్రంలో గనులశాఖ సమర్థంగా పనిచేస్తోందనేందుకు ఇది నిదర్శనం.

మీ హయాంలో ఏనాడైనా అవార్డు వచ్చిందా..?
        రాష్ట్రంలో మైనింగ్ రంగం అత్యంత పారదర్శకతతో పనిచేస్తోంది. ఇందుకు గానూ కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లు పనిచేసిన కాలంలో,  మీ హయాంలో మైనింగ్‌ శాఖ బ్రహ్మాండంగా పనిచేసిందని కేంద్రం పిలిచి, ఏనాడైనా ఒక్క అవార్డు ఇచ్చిందా? అదే మా మూడేళ్ల పాలనలోనే అవార్డు తీసుకున్నాం.  మా ప్రభుత్వం వచ్చాక, మైనింగ్ రంగంలో బాగా పని చేస్తున్న రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. కేంద్రమంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషీలు ఏపీని అభినందించారు. ఇందుకుగాను ఏకంగా రూ.2.40 కోట్లు నగదు ప్రోత్సాహకంగా గనులశాఖకు అందించారు. చంద్రబాబు హయాంలో ఎనాడైనా ఇటువంటి పురస్కారం, గుర్తింపు లభించాయా? తన హయాంలో ఒక్కో టిడిపి ఎమ్మెల్యే..  చెరువుల్లో లక్షల టన్నుల మట్టి, గ్రావెల్ ను తోడుకున్నారు. ఆనాడు వాటిని నిరోదించలేని ఆయన ఇప్పుడు మాపై ఆరోపణలు చేస్తున్నాడు.

- మైనింగ్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి బాగా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచాం. కుప్పంలో కూడా గెలవలేని చంద్రబాబు,  నా మీద, ముఖ్యమంత్రిగారి మీద చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. 

 - శాటిలైటింగ్‌ ఇమేజ్‌ సిస్టం గురించి ముందుగా చంద్రబాబు అవగాహన ఏర్పాటు చేసుకుని, నేర్చుకుని మాట్లాడితే బాగుంటుంది. మేము అనుమతించిన మైనింగ్‌ తవ్వకాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు నిరూపిస్తే.. దానికి నేను బాధ్యత వహిస్తాను.
- చంద్రబాబు ఆరోపణలకు ఓ వర్గం మీడియా వత్తాసు పలకడం సబబు కాదు.
-  పరిపాలన సౌలభ్యం కోసం చిత్తూరు జిల్లాలో పుంగనూరును పెట్టడం తప్పేమీ కాదు. 
- కుప్పం రెవెన్యూ డివిజన్‌ కావాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగారికి కి లేఖ రాస్తే.. రెవెన్యూ డివిజన్‌ చేయడం జరిగింది. మేము చిత్తూరులో ఉండటం మాత్రం ఆయనకు ఇష్టం లేదు. రాజకీయ కుట్రదారుడిలా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.
- చంద్రబాబుకు స్ట్రాటజీ లేదు ఏమీలేదు. అదృష్టం కొద్దీ మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే, ఆయనకు ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా లేదు.
 

Back to Top