అమరావతి: బీజేపీ గేట్లు పట్టుకుని వేలాడుతుంది ఎవరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబును ప్రశ్నించారు. నువ్వు గేట్లు తీస్తే మా పార్టీ ఉండదా..? మతిపోయిందా..? బుర్ర పాడైందా..? అని మండిపడ్డారు. చంద్రబాబు ముసలి నక్క, జిత్తులమారివి అని రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడిచి చావుకు కారణం.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే: బీజేపీ గేట్లు పట్టుకుని వేలాడుతున్నది ఎవరు బాబూ..? - చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడుతూ తాము గేట్లు తెరిస్తే వైయస్ఆర్‌సీపీ ఉండదని అన్నారు. - ఆయన ఢిల్లీకి వెళ్తోందే ఎప్పుడు బీజేపీ గేట్లు తెరుస్తుందా..దూరుదాం అనే అలోచనతోనే.. - ఆయన ఉనికి కోసం పాట్లు పడుతూ మా పార్టీ ఉండదంటున్నాడు. - అదేమంటే కుర్రాడు..బచ్చా అంటూ మాట్లాడుతున్నారు...నువ్వు ముసలి నక్కవి. నువ్వు జిత్తుల మారివి అనేది మాకు తెలుసు. - చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు అనేది రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. - చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది ఎవరినైతే వెన్నుపోటు పొడిచాడో.. ఏ మహానుభావుడి మృతికి కారకుడు ఆయ్యాడో ఆ కార్యక్రమానికి వెళ్లాడు. - నువ్వు బీజేపీతో చెలిమి చేస్తావో..ఎవర్ని పొగుతాడుతావో పొగుడుకో. - నువ్వు గేట్లు తీస్తే మా పార్టీ ఉండదని అనడం ఏమిటి..? మతిపోయిందా..? బుర్ర పాడైందా..? - నేను మొన్ననే చెప్పాను. ఉగాది తర్వాత తెలుగుదేశం పార్టీ కనుచూపు మేర ఉండదని చెప్పా. మళ్లీ అదే చెప్తున్నా. - ఈ రాష్ట్రంలో స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆలోచన, ఆశయంతో పుట్టిన పార్టీ వైయస్ఆర్‌సీపీ. - ఒక అడుగు తండ్రి వేస్తే రెండడుగులు కొడుకుగా నేను వేస్తానని చెప్పి ఆ దిశగా పాలన చేస్తున్న వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. - ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేసిన మా పార్టీకి ధైర్యంగా మాట్లాటే పేటెంట్ ఉంది. దయచేసి నోరు అదుపులో పెట్టుకో చంద్రబాబూ..: - నువ్వేమి మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావా..? - చంద్రబాబూ...సంయమనం పాటించండి. బాష మీద పట్టుండాలి. - ఒక ముఖ్యమంత్రిగా పని చేసిన నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ మాటలేంటి..? - నువ్వొక మాట అని తిరిగి మరో మాట అనిపించుకోవడం దేనికీ..? - నీ తీరు, మాట మారాలని నీ ముసలితనం గురించి మాట్లాడాల్సి రావడం నాకు బాధాకరమే. - మనిషికి వయసు కాదు కావాల్సింది..ఆలోచన కావాలి. - మన నోటినుంచి వచ్చే మాట మన వయసు, తత్వాన్ని, ఆలోచనను చెప్తూ మన గౌరవాన్ని పెంచాలి. - ఆలోచించుకుని దయచేసి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది చంద్రబాబు - స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఇవ్వని గొప్ప తీర్పును ప్రజలు వైయస్ఆర్‌సీపీకి ఇచ్చారు. - వైయస్ జగన్ గారిని నాయకుడిగా ప్రజలు ఎన్నుకున్నారు. - రానున్న ఎన్నికల్లో నీ సత్తా ఏంటో, మా సత్తా ఏంటో తేల్చుకుందాం. - వైయస్ జగన్ గారి ఆలోచన ఏంటో, ఆయన పరిపాలన ఏంటో అప్పుడు తెలుస్తుంది. - నీ మాయ, మోసం ఏంటో నీ తత్వం ఏంటో రానున్న ఎన్నికల్లో తేలుతుంది. - ఇష్టారాజ్యంగా మాట్లాడటం సమంజసం కాదు...రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి పెద్ద మనసుతో ఆలోచించండి. - ఇలాంటి దుష్టశక్తుల వల్ల సంక్షేమ పాలనకు ఆటంకం కలగకుండా ఉండాలని కోరుకుంటున్నా.