నరసాపురంలో రాజగోపాల్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహణ

నరసాపురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నరసాపురం పట్టణంలోని శ్రీ రాజగోపాల్ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు  ముదునూరి ప్రసాద్ రాజు , ఎమ్మెల్సీ  వంక రవీంద్రనాథ్ , ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై సాగిన అసత్య ప్రచారాలను ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సత్యమార్గంలో నడవాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని అన్నారు.

తిరుమల లడ్డు అంశంలో జరిగిన తప్పుడు ప్రచారాలు పూర్తిగా అబద్ధమని తేలిన నేపథ్యంలో, ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా సద్బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. అలాగే తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడటం ప్రతి భక్తుడి కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పూజలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Back to Top