వైయ‌స్ జ‌గ‌న్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు

నెల్లూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆకాంక్షిస్తూ వైయ‌స్ఆర్ సీపీ కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని మరోసారి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధిరోహించాలని కోరుతూ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నార్త్ రాజుపాలెంలో చేపట్టిన నారికేళ సహిత పాదరస లింగేశ్వర మహా రుద్రాభిషేకం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ పూజ‌ల్లో రాజ్య‌స‌భ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Back to Top