ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావాల‌ని ప్రత్యేక దువా 

బాబ‌య్య ద‌ర్గాలో వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు 

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: లిక్కర్ కేస్ లో అక్రమంగా అరెస్టు అయి రాజ‌మహేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైల్‌లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోగ్యం బాగుండాలని, ఆయ‌న‌కు త్వరగా బెయిల్ మంజూరు కావాల‌ని  కోరుతూ రాయలసీమలోనే ప్రసిద్ధి గాంచిన సత్యసాయి జిల్లా,  పెనుగొండ లోని బాబయ్య దర్గాలో  ప్రత్యేక చద్దార్ ను సమర్పించి ప్రత్యేక దువా కార్యక్రమం (ప్రార్థన) నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే లిక్కర్ కేసు లో ఎలాంటి ఆధారాలు లేకున్నా  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని అరెస్ట్ చేసినట్లు మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వ‌జ‌మెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాధరణ చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలతో ఎల్లో మీడియా ద్వారా దుష్పచారం చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసు నుంచి ఎంపీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని బాబా స‌లామ్ ఆకాక్షించారు. 

Back to Top