తాడేపల్లి: మహ్మద్ ప్రవక్త బోధించిన బోధనలు సదా అనుసరణీయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తన ఎక్స్ ఖాతాలో సందేశం పంపించారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. శత్రువులను సైతం క్షమించాలని, ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, సహనం కలిగి ఉండాలని మహ్మద్ ప్రవక్త బోధించిన బోధనలు సదా అనుసరణీయం. నేడు మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.