ఎర్ర చందనం సంరక్షణకు ప్రత్యేక చర్యలు  

 మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

అమ‌రావ‌తి: ప్రపంచంలా ఎక్కడా దొరకని ఎర్ర చందనం మన రాష్ట్రంలో పెరుగుతుంది కనుక దాని సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం 86 బేస్ క్యాంపులు, 30 స్ట్రైకింగ్ ఫోర్టులు, 50 చెక్ పోస్టులు, 2 డాగ్ స్క్వాడ్ లు, అటవీ సిబ్బందికి ఆయుధాలు అందించామ‌న్నారు. డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించే ఏర్పాటు చేసామ‌ని తెలిపారు. యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. సోమ‌వారం అసెంబ్లీలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట్లాడారు.

ఏపీ భౌగోళిక విస్తీర్ణం 1,62,968 చదరపు కి.మీ. 
అటవీ ప్రాంతం - 37,158 చ.కి.మీలు.
జగనన్న పచ్చ తోరణం కింద పచ్చదనం పెంపుదలకు, పర్యావరణ పరిరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టామన్నారు పెద్దిరెడ్డి. 
ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2021 ప్రకారం అటవీ విస్తీర్ణం 646.9 చ.కి.మీగా పెరిగింది.  అంటే అటవీ% పెరిగింది. అటవీ విస్తీర్ణం పెంపుదలలో ఏపీది తొలిస్థానం.  
అర్బన్ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో నగర వనాలు పెంచుతున్నాము. 2023-24లో ఈ ప్రాజెక్టు కోసం 16 కోట్లతో 23 ప్రదేశాల్లో నగరవనాలు, టెంపుల్ ఎకో పార్కుల అభివృద్ధికి ప్రతిపాదాన చేసాము. 13 లక్షల మొక్కలతో ఎవెన్యూ ప్లాంటేషన్, ఇప్పటికే 1650 కోట్లతో చేసిన ప్లాంటేషన్ నిర్వహణ, నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్ కింద 1650 హెక్టార్లలో ప్లాంటేషన్ వీటన్నిటికోసం 26.48 కోట్లు ఖర్చు చేస్తున్నాము. అటవీయేతర అవసరాలకు ఇచ్చిన అటవీ భూములకు బదులుగా ఇచ్చిన వేస్ట్ ల్యాండ్ ను డెవలప్మెంట్ కోసం, ఫారెస్ట్ ఏరియాను పెంచడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకూ 52,921 హెక్టార్ల విస్తీర్ణం పెంచడం జరిగింది. 
ప్రపంచంలా ఎక్కడా దొరకని ఎర్ర చందనం మన రాష్ట్రంలో పెరుగుతుంది కనుక దాని సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. 86 బేస్ క్యాంపులు, 30 స్ట్రైకింగ్ ఫోర్టులు, 50 చెక్ పోస్టులు, 2 డాగ్ స్క్వాడ్ లు, అటవీ సిబ్బందికి ఆయుధాలు అందించాం. డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించే ఏర్పాటు చేసాం. యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసాం. స్మగ్లింగ్ చేసే వారిని పట్టుకుని రికవర్ చేసిన 5,176 టన్నుల ఎర్రచందనాన్ని వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో కొంత భాగాన్ని వేలం వేయడం ద్వారా రాష్ట్రానికి 170 కోట్ల ఆదాయం వచ్చింది. 
పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల పెంపకంపై ఈ రాష్ట్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలియజేసారు మంత్రి పెద్ది రెడ్డి.

Back to Top