కాసేపట్లో పలాసకు వైయస్ జగన్

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించడానికి కాసేప‌ట్లో ప‌లాస‌కు రానున్నారు. ప్రజాసంకల్పయాత్రలో జిల్లాలో అశేష జనాదరణ పొందిన జననేత ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి రెట్టించిన ఉత్సాహంతో అడుగిడుతున్నారు. సిక్కోలులోని అన్ని స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ  విజయబావుటా ఎగురవేసే లక్ష్యంతో ఆయన ఎన్నికల సమరానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలోనూ అన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఎలాంటి అసంతృప్తికి ఆస్కారం లేకుండా చూశారు. పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పలా సలోజరిగే తొలి ఎన్నికల ప్రచార సభలో పార్టీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి పా ల్గొంటున్నారు. పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అనంతరం పలాస ఇందిరా చౌక్‌ జంక్షన్‌ వద్ద జరిగే ఎన్ని కల ప్రచార సభలో ఆయన ప్రసంగించనున్నారు.

Back to Top