వైయ‌స్ఆర్‌ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

నెల్లూరు:  మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్ఆర్ ట్రేడ్ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో నెల్లూరు న‌గ‌రంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌ ట్రేడ్ యూనియన్ ఆత్మకూరు నియోజకవర్గ అధ్యక్షుడు కూరపాటి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనల మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ట్రేడ్ యూనియ‌న్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ..పేద విద్యార్థుల కోసం గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి మంజూరు చేయించి అందులో 5 కళాశాలలు నిర్మాణం పూర్తి చేయించారని, అయితే చంద్రబాబు స్వార్థంతో తన వారి కోసం వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రపన్నడం దారుణమని  మండిపడ్డారు. 
కేవలం రూ.5 వేల కోట్లతో కళాశాలలను ఈ విద్యా సంవత్సరానికి సిద్ధం చేసేందుకు అవకాశం ఉన్నా ఆ దిశగా కూటమి నాయకులు ఆలోచన చేయడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్పరం చేయడం చంద్రబాబుకు అలవాటేనని, తన అనుంగులుకు విద్యపై పెత్తనం ఇచ్చేందుకే ప్రైవేట్ పరం చేస్తున్నాడన్నారు.  పీపీపీ విభాగాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు ప్రైవేటీకరణ దిశగా జీఓలు తేవడం దారుణమన్నారు.   కార్యక్రమంలో నోటి వినయ్ కుమార్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పరంధామయ్య, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు నందా ఓబులేసు, ఏఎస్ పేట మండల ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కె ప్రసాద్ రెడ్డి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పోలు వెంకటేశ్వర్లు,పార్టీ మున్సిపల్ విభాగ జిల్లా కార్యదర్శి నందవరం ప్రతాప్, ఏఎస్ పేట సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు వేలమూరి హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top