సోషల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌ను చైత‌న్య‌వంతం చేసేందుకే వ‌ర్క్‌షాప్‌

ప్రారంభ‌మైన రెండో రోజు సోష‌ల్ మీడియా వ‌ర్క్‌షాప్‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌ను చైత‌న్య‌వంతం చేసేందుకు వ‌ర్క్‌షాపు నిర్వ‌హిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్ గుర్రంపాటి దేవేంద్ర‌రెడ్డి పేర్కొన్నారు. కొద్దిసేప‌టి క్రితం తాడేప‌ల్లిలో రెండో రోజు వ‌ర్క్‌షాపు ప్రారంభ‌మైంది. మొద‌టి రోజు సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త గురించి వివ‌రించి, కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాల‌ను సేక‌రించారు. ఈ సంద‌ర్భంగా దేవేంద్ర‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ వ్యవస్థ అయినా సమర్ధవంతంగా పనిచేస్తూ  ముందుకుపోవాలి అంటే అందుకు తగిన ఖచ్చితమైన, పటిష్టమైన నిర్మాణం ఉండాల‌న్నారు. అందులో భాగం గానే జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ కన్వీనర్ల నియామకం చేపట్టడం జరిగింద‌న్నారు. మొదటిగా జిల్లాస్థాయి కన్వీనర్లు, కో-కన్వీనర్లు తో రెండు రోజుల పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వర్క్ షాప్ నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు.  అనంతరం నియోజ‌క‌వ‌ర్గ‌ స్థాయి, మండల స్థాయి వర్క్ షాప్స్ నిర్వహిస్తామ‌న్నారు. రాబోయే రోజుల్లో కూడా అందరినీ భాగస్వాములను చేస్తూ ఇలాంటి మరిన్ని వర్క్ షాప్స్ తో సోషల్ మీడియాను మరింత బలోపేతం చేస్తూ జ‌గ‌న‌న్న‌కు మంచి సైన్యాన్ని త‌యారు చేస్తామ‌ని చెప్పారు. పదవి అదనపు బాధ్యత మాత్రమే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరూ సమానమే అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులు ఐక్య‌మ‌త్యంతో ముంద‌డుగు వేస్తూ జ‌గ‌న‌న్న‌కు అండ‌గా నిలుద్దామ‌ని విజ్ఞ‌ప్తి చేశారు.  రెండో రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వర్క్ షాప్ లో పాల్గొన్న కార్య‌క‌ర్త‌లు స‌భా ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఫ్లెక్సీల వ‌ద్ద ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా వ‌ర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top