రైల్వే కోడూరు: సామాజిక సాధికార యాత్రతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు దద్ధరిల్లింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బైక్ ర్యాలీ, బస్సు యాత్రలో జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగనన్న ఇచ్చిన సాధికారతను నేతలు తమ ప్రసంగాల్లో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్‌బాబు, నటుడు ఆలీ తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.. ఎంపీ నందిగం సురేష్ * ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కలిసి రాష్ట్రాన్ని పాలించుకొనే బాధ్యత తీసుకోవాలని పగ్గాలిచ్చిన జగనన్న. * రాష్ట్రానికి చంద్రబాబు ఏమీచేయకపోగా కుళ్లు, కుట్రలు, మోసపూరిత రాజకీయాలు చేశారు. * ఎక్కడికక్కడ కించపరిచేలా కులాల వారీగా విభజించి పాలించాడు. * 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మంచి పథకం గానీ, అభివృద్ధిగానీ చేయలేదు. * జగనన్న నాలుగున్నరేళ్లలోమంచి పాలన ఇస్తున్నారు. అవ్వాతాతలకు పింఛన్ ఇస్తున్నారు. చిన్నారులు బాగా చదువుకుంటున్నారు. * ఏనాడూ జగనన్న రాజకీయ నాయకుడిలా ఆలోచించలేదు. * చంద్రబాబు రాష్ట్రంపై పెత్తనం చేసి బినామీలకు దోచిపెట్టాడు. ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తున్నాడు. * చంద్రబాబు వెన్నుపోటు పథకం మాత్రమే పెట్టాడు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచాడు. * ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అనే వ్యక్తి చంద్రబాబు. * ఎస్సీలు నా మేనమామలు, మేనత్తలనే వ్యక్తి జగనన్న. ఇద్దరికీ వ్యత్యాసం గమనించాలి. * చంద్రబాబు ఏడు నక్కలతో సమానం, జగనన్న ఏడు నాగలోకాలతో సమానం. * ఎంత మంది కొత్త శత్రువులు వచ్చినా జగనన్నకు పోయేదేమీ లేదు. * మహిళలకు 50 శాతం రిజర్వేషన్, 70 శాతం నామినేటెడ్ పోస్టులు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. * ఏపీలో జగన్ వచ్చిన తర్వాత 1.70 లక్షల అప్పులు చేస్తే, చంద్రబాబు మాత్రం 2.60 లక్షల కోట్లు అప్పులు చేశారని నిర్మలా సీతారామన్ చెప్పారు. * జగనన్న చేసిన అప్పులన్నీ అవ్వాతాతలు, రైతులు, పేద మహిళల ఖాతాల్లో వేశారు. * 99 శాతం హామీలు నెరవేర్చిన జగనన్న మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని చెబుతున్నారు. * వ్యవసాయ కూలీ కొడుకు అయిన నన్ను చంద్రబాబు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తే జగనన్న పార్లమెంటులో కూర్చోబెట్టాడు. * మన ఆకలి, మన సమస్యలు తెలిసిన వ్యక్తి జగనన్న * పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని ప్రయత్నిస్తున్నారు. * పవన్‌కు కావాల్సింది ప్యాకేజీ, చంద్రబాబుకు కావాల్సింది అడ్డదిడ్డంగా సీఎం అయి లోకేష్‌కు దోచిపెట్టడం. * విజయవాడలో అంబేద్కర్ విగ్రహం తాడేపల్లివైపు చూపిస్తుంటుంది. నా ఆశయాలు నెరవేర్చే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చూపిస్తుంది. * ఒక దినం గడవాలంటే చంద్రబాబు, ఒక తరం గడవాలంటే జగనన్న రావాలి. * పీకే, లోకేష్, చంద్రబాబు, పవన్ లాంటి వంద మంది కలిసొచ్చినా 2024లో జగనన్నను సీఎం అవకుండా ఆపలేరు. ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు * జగనన్న అధికారం చేపట్టిన నాటి నుంచి బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. * మన అవసరాలను గుర్తించి, రావాల్సినవన్నీ వచ్చేలా చేస్తున్నారు. * మధ్యవర్తిత్వం లేకుండా ప్రతి పథకం అమలు చేస్తున్నారు. * జగనన్న ఇళ్లు, అమ్మ ఒడి, విద్యాదీవెన, రైతు భరోసా, చేయూత ఇలా అనేక కార్యక్రమాలు జగనన్న చేస్తున్నారు. * పేద ప్రజలకు ఏ అవసరం ఉన్నా రాత్రి ఆలోచించి ఉదయం అమలు చేస్తున్న జగనన్న. * సీఎం జగన్ గారు ప్రమాణ స్వీకారం అయిన నాటి నుంచే ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేశారు. * ప్రతి ఇంటికీ పథకాలు తలుపుతట్టి సచివాలయం ద్వారా, వాలంటీర్ల ద్వారా అందిస్తున్నారు. * గతంలో జన్మభూమి కమిటీలో వారి పార్టీ వారికే పథకాలు ఇచ్చేవారు. * గత ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలి. * పుట్టిన బిడ్డ నుంచి అవ్వాతాత వరకు నవరత్నాల ద్వారా జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగనన్న. నటుడు ఆలీ * కోడూరు వాసులు ఎక్కడున్నా కష్టపడే నైజం కలిగినవారు. * నేను కువైట్ వెళ్లినప్పుడు అక్కడ కోడూరు వారే ఎక్కుడ కనిపించారు. * రానున్న రోజుల్లో జగనన్నను మీరంతా ఆశీర్వదించాలి. * 2019లో ఏ రేంజ్‌లో 151 ఇచ్చామో.. ఇప్పుడు వైనాట్ 175 మన టార్గెట్. * మనం జగనన్నకు ఇచ్చే గిఫ్ట్ ఇదే. * అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములంతా ఆయనకు 2024లో పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. * 2024.. జగనన్న వన్స్ మోర్.