బాబును విచారిస్తే రూ.2 లక్షల కోట్లు బయటపడతాయి

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
 

 

తాడేపల్లి: పర్సనల్‌ సెక్రటరీ దగ్గరే రూ. 2 వేల కోట్ల అక్రమ సంపాదన ఉందంటే.. ఇక చంద్రబాబును విచారిస్తే రూ. 2 లక్షల కోట్లుపైగా అవినీతి సొమ్ము బయటపడుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓ చిన్న తీగ లాగితే రూ.2 వేల కోట్లు బయటకువచ్చాయి.. ఇక డొంక చాలా పెద్దది అని తెలుస్తుందన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల్లో బాబు పీఎస్‌ దగ్గర లభించిన నల్లధనంపై పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని అప్పుల ఊబిలోకి నెట్టాడని, దోచుకున్న సొమ్మునంతా విదేశాల్లో దాచారని మండిపడ్డారు. ఆధారాలు ఉంటే విచారణ చేయండి అని సవాళ్లు విసిరే చంద్రబాబు దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఈనాడు పత్రిక ఐటీ దాడులపై అర్థంపర్థం లేని కథనం రాసిందన్నారు. చంద్రబాబు అవినీతి సంపాదనపై ఆధారాలు కూడా ఉన్నాయని, తొందరలోనే బయటకు వస్తాయన్నారు.

తాజా వీడియోలు

Back to Top