ఫోన్‌ ట్యాపింగ్‌ అంతా అబద్ధం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామ‌కృష్ణారెడ్డి

చంద్రబాబు వ్యూహంలో భాగమే ఫోన్‌ ట్యాపింగ్‌ రాద్ధాంతం

మైనార్టీలు లేకుండా వైయ‌స్ఆర్‌సీపీ లేదు

తాడేప‌ల్లి:  ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంతా అబ‌ద్ధ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.  చంద్రబాబు వ్యూహంలో భాగమే ఫోన్‌ ట్యాపింగ్‌ రాద్ధాంతమన్నారు. కోటంరెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందని ప్రశ్నించారు. లేని దానిపై అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి తన ఫ్రెండ్‌కు ఫోన్‌ చేస్తే అతనికే ఎందుకు పంపిస్తారని ప్రశ్నించారు. కోటంరెడ్డి కాల్‌ చంద్రబాబే రికార్డు చేయించినా ఆశ్చర్యం లేదన్నారు. చంద్రబాబు హామీతోనే టీడీపీ నుంచి పోటీ చేస్తానని కోటంరెడ్డి చెప్పారన్నారు.   ఇదంతా చంద్రబాబు స్కీమ్‌లో భాగమేని, కోటంరెడ్డి లాంటి వ్యక్తులంతా పాత్రదారులని తెలిపారు.

 
మైనారిటీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అండ‌
 మైనార్టీలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు సీఎం వైయ‌స్‌ జగన్‌ అందిస్తున్నారన్నారు. తాడేపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన మైనార్టీ సదస్సులో సజ్జల మాట్లాడుతూ.. డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం హామీలకు పరిమితమైందన్న సజ్జల ఇచ్చిన హామీలన్నీ సీఎం వైయ‌స్‌ జగన్‌ అమలు చేశారని ప్రస్తావించారు.
 
ముస్లిం మైనార్టీలకు ఆనాడు మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి న్యాయ చేశారని.. ఇప్పుడు వైయ‌స్‌ జగన్‌ న్యాయం చేశారని గు​ర్తు చేశారు. అన్ని పథకాల్లోనూ మైనార్టీలకు ప్రాధాన్యతనిచ్చామని పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థులు చదువుకునే స్కూళ్లను అభివృద్ధిచేశారని చెప్పారు. మైనార్టీలు లేకుండా వైయ‌స్ఆర్‌సీపీ లేద‌న్నారు. 

తాజా వీడియోలు

Back to Top