చంద్రబాబు అంతే..ఎప్పటికీ మారరు

 ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి 
 

 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునా​యుడుపై ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ట్వీటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌ల్లో ప్రగల్భాలు పలుకుతూ, ప్రభుత్వంపై నిందలు మోపుతూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. ‘చంద్రబాబు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయి ఇవ్వాళ్టికి 56 రోజులు. 60 వీడియో కాన్ఫరెన్స్‌లు, 60 టెలీకాన్ఫరెన్స్‌ల్లో ప్రగల్భాలు పలుకుతూ, ప్రభుత్వంపై నిందలు మోపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆఫ్ లైన్లో రాష్ట్ర ప్రయోజనాలకు, పేదల ప్రయోజనాలకు గండికొడుతున్నారు. ఆయన ఎప్పటికీ మారరు.’ అని రామకృష్టారెడ్డి ట్వీట్‌ చేశారు. 

Back to Top