టీడీపీ, వైయ‌స్‌ సునీత, పచ్చమీడియా క‌లిసి అవినాష్‌పై అసత్య ప్రచారం

 వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు

తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారు

 కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో కథనాలు ప్రసారం

 తాడేప‌ల్లి:  టీడీపీ, వైయ‌స్‌ సునీత, పచ్చమీడియా.. అంతా కలిసి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నార‌ని  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిప‌డ్డారు.  వివేకా కేసులో తమ పార్టీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, తన తల్లికి సీరియస్‌గా ఉంది గనుకే ఇవాళ విచారణకు హాజరు కాలేదని స్పష్టం చేశారు. అయితే.. అవినాష్‌రెడ్డి గైర్హాజరు విషయంలో కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో కథనాలు ప్రసారం చేస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారు.  శుక్రవారం తాడేపల్లిలో సజ్జల  రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే అవినాష్‌ హైదరాబాద్‌కు వచ్చారు. తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారు. అయినా ఏదో జరిగిపోతోందంటూ కొందరు హడావిడితో​ కూడిన ప్రచారం చేస్తున్నారు.  కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దుష్ఫ్రచారం చేస్తున్నాయి.. వార్తలు ఇస్తున్నా​యి.    గతంలో ఆయన సీబీఐ పిలిచిన ప్రతీసారి హాజరయ్యారు. ఆయన సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నార‌ని తెలిపారు.

వైయ‌స్ అవినాష్‌రెడ్డి ఎక్కడికీ పోవడం లేదు.. తప్పించుకోవాల్సిన అవసరం అవినాష్‌రెడ్డికి లేదు అని సజ్జల స్పష్టం చేశారు. అవినాష్‌పై బుదర చల్లాలనే కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఐదుసార్లు సీబీఐ విచార‌ణ‌కు వెళ్లిన అవినాష్‌రెడ్డి ఇప్పుడెందుకు వెళ్ల‌డు. ఒక‌వేళ‌ ఎక్స్‌ట్రీమ్‌గా వ్య‌వ‌హ‌రించినా ఫేస్ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. త‌న త‌ల్లికి బాగోలేద‌ని సీబీఐ  అధికారుల‌కు చెప్పి అవినాష్‌రెడ్డి వెళ్లార‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

Back to Top