ఒంగోలు: సామాజిక సాధికార యాత్రతో ఒంగోలు పట్టణం దద్దరిల్లింది. జై జగన్ నినాదాలతో మార్మోగింది. వేలాది మంది జనం మధ్య బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఉత్సాహంగా ప్రసంగించారు. ఆద్యంతం ఇసకేస్తే రాలనంత జనం మధ్య యాత్ర సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజని, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, హఫీజ్ ఖాన్, కేపీ నాగార్జునరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే.. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ... – ఒంగోలులో నేల ఈనిందా అన్నట్లు ప్రజానీకం వచ్చారు. – రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అన్యాయం చేసి అసమానతలు, అఘాయిత్యాలు, దాడులు చేయించాడు. – జగనన్న ఈ వర్గాలను గుండెల్లో పెట్టుకున్నారు. సామాజిక విప్లవానికి తెర తీశారు. అంబేద్కర్ కోరుకున్నట్లు పాలన చేస్తున్నారు. – పేద వారి పక్షాన జగనన్న ఉన్నాడని, గుడ్డ కాల్చి ముఖంపై వేయాలని చూస్తున్న చంద్రబాబు. – ఏ ఆస్పత్రికి వెళ్లినా చూపించుకుని వచ్చేలా ఖర్చులకు డబ్బులిస్తున్న జగనన్న. – 31 లక్షల ఇళ్లపట్టాలిస్తే అగ్ర తాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. – రూ.2.40 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు పంచితే అగ్ర తాంబూలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. – ఉద్యోగాలు ఇస్తే 78 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. ఇంతకు ముందెన్నడూ ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదు. – చంద్రబాబు మోసగాడు, 14 ఏళ్లు అబద్ధం రాష్ట్రాన్ని పాలించింది. – నాలుగున్నరేళ్ల నుంచి ఒక నిజం పాలిస్తోంది. సామాజిక విప్లవం పరిఢవిల్లుతోంది. – చంద్రబాబును నమ్మొద్దు, మోసగాడు, దగాకోరు. – రాష్ట్రానికి జగనన్న సీఎం కావడం మనకు అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవసరం. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... – వరుణ దేవుడి ఆశీస్సులు, వైయస్సార్ ఆశీస్సులు మనందరిపై ఉన్నాయి. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన మమ్మల్ని మంత్రులుగా చేసిన జగనన్న. – జగనన్న ఆలోచనా విధానం దూరదృష్టి కలిగి ఉంది. – ఆరోజు ఫ్యాన్ గాలి 151 స్పీడుతో వీచింది. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకున్నాం. – నాలుగున్నరేళ్లలో ఇచ్చిన సంక్షేమ ఫలాలు అనుభవించాం. – ఈరోజు ఫ్యాన్ గాలి ఇంకా ఎక్కువ వీస్తోంది. 175 స్పీడ్‌తో వీస్తోంది. – జగనన్న సీఎం అయితేనే మన పిల్లల తలరాతలు మారతాయి. – 5 రాష్ట్రాల మేనిఫెస్టోల్లో జగనన్న హామీలు చోటుచేసుకున్నాయి. – రాజస్తాన్‌లో ఓ పార్టీ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం పెడతామంటున్నారు. – పక్క రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ తెస్తామంటున్నారు. – ఇవన్నీ మనకు నాలుగేళ్ల కిందటే వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలంటే జగనన్నను గెలిపిద్దాం. మంత్రి విడదల రజని మాట్లాడుతూ.... - బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరుగుతున్న పట్టాభిషేకం ఈ బస్సు యాత్ర. – దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్నది చంద్రబాబు. – దళితులను అక్కున చేర్చుకొని అన్ని విధాలుగా సంక్షేమం, అభివృద్ధి, అవకాశాలు కల్పించిన ముందు పెట్టిన నాయకుడు జగనన్న. – బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు. బీసీలకు కార్పొరేషన్లు, పదవులిచ్చి అందలం ఎక్కించిన నాయకుడు జగనన్న. – గిరిజనులకు మొండి చేయి చూపిన చంద్రబాబు. గిరిజనులకు కార్పొరేట్ స్థాయి వైద్యం, విద్య, అన్ని సదుపాయాలు, సంక్షేమం అందిస్తున్న నాయకుడు జగనన్న. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు. మైనార్టీలకు డిప్యూటీ సీఎం ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టిన జగనన్న. – సామాజిక సాధికారతకు వేదికపై నిల్చున్న ప్రతి ఒక్కరూ నిలువెత్తు సాక్ష్యం. – సామాజిక సాధికారత అంటే పేదవాడి ఇంటికి కార్పొరేట్ వైద్యం అందడం. రేషన్ ఇంటి వద్దకు అందడం, అన్ని పథకాలూ ఇంటి వద్దకే అందడం. – రాజధాని ఎక్కడో ఉండటం కాదు, గ్రామ గ్రామాన సచివాలయాల పరిపాలన ప్రజల ముందే అందుతున్నప్పుడు సామాజిక సాధికారత. ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... – దేశంలో బీసీ నాయకుడిగా అన్ని రాష్ట్రాలూ తిరిగాను. – ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు మమ్మల్ని ఏపీలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. – ఎందుకు అని అడిగితే, అక్కడి పిల్లలు అందరూ మంచి చదువులు చదువుకుంటున్నారు, మా పిల్లలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి హోటళ్లలో పెట్రోలు బంకుల్లో పని చేస్తున్నారని చెప్పారు. ఏపీలో అమ్మ ఒడి ఉంది, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉందంటున్నారు. – తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బీసీ సీఎంలు ఉన్నా అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టళ్లు, గురుకులాలు లేవు. – కానీ సీఎం జగన్ పేద పిల్లలు విదేశీ చదువులు చదువుతున్నా సాయం చేస్తున్నారు. – 10, 20 ఏళ్ల తర్వాత ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలందరూ విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేసేలా ఎదుగుతారు. – సీఎం జగన్..పేదవర్గాల విద్యార్దులు డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు కావాలని అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటివి ప్రవేశపెట్టి మంచి చదువులు చదివిస్తున్నారని, ఇతర రాష్ట్రాలు మమ్మల్ని ఏపీలో కలపాలంటున్నారు. – అధికారంలో, సంపదలో, ఆస్తిలో బీసీలకు వాటా ఇచ్చిన సీఎం జగన్. – ఎంపీలుగా ఐదుగురు బీసీలకు అవకాశం ఇచ్చారు. – మామూలు కుటుంబంలో పుట్టిన నన్ను రాజ్యసభకు పంపారు. పేద కులాల గురించి కొట్లాడాలని చెప్పాడు. – పేద కులాలను పదవులిచ్చి నాయకులుగా తయారు చేసిన జగనన్నకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎంపి నందిగం సురేష్ మాట్లాడుతూ.... – ప్రతి కుటుంబంలో ఒక పెద్దలా, కుటుంబ సభ్యుడిలా, పెద్దకొడుకులా మారి మన సమస్యలు వింటున్న జగనన్న. – జగనన్న ఇచ్చిన హామీలు 99 శాతం నెరవేర్చి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. – జగనన్నను మిస్ చేసుకుంటే రాక్షసుడు వస్తాడు. మనందరం ఇబ్బంది పడతాం. – మన పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవాలన్నా, అవ్వాతాతలు పింఛన్లు సమయానికి తీసుకోవాలన్నా, నాడు-నేడు స్కూళ్లు బాగుండాలంటే, విద్యా, వైద్యం, పేదవాడి ఆరోగ్యం, రైతులు బాగుండాలంటే జగనన్న రావాలి. – తనకున్న సంపద కాకుండా మన కంచంలో కూడు లాగేసుకోవాలనుకొనే వ్యక్తి చంద్రబాబు. – సామాన్యుడు, వ్యవసాయ కూలీ కొడుకు గ్రీన్ ఇంకుతో సైన్ చేసే అవకాశం వచ్చిందంటే జగనన్న కారణం. – చంద్రబాబును నమ్మి బాగుపడిన వ్యక్తి లేరు. వైయస్ ఫ్యామిలీని నమ్మి చెడిపోయిన వారు లేరు. – జగనన్న పేదవాడి ప్రేమకే బానిస తప్ప ఎవడికీ బానిస కాదు. – విజయవాడలో అంబేద్కర్ విగ్రహం తాడేపల్లివైపు చూపుతుంది. నా ఆశయాలను మీ జీవితాలను గెలిపించే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చెబుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఎంఎల్ ఏ బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... – పేద, బడుగు వర్గాల కోసం సామాజిక సాధికారత సాధించిన ఘనత జగనన్నది. – పేద, బడుగు వర్గాలను సమానంగా చూడాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఈబీసీలకు ఎన్నో పథకాలిచ్చారు. – ప్రతి కుటుంబం ఇంట్లో జగనన్న బొమ్మ పెట్టుకొనేలా చేశారు. – రాజశేఖరరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు పెట్టి పేదవారు, మధ్య తరగతి గుండెల్లో నిలిచిపోయారు. – వైయస్సార్ చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్నగారి ఫొటో ఉంది. రేపు ప్రతి ఇంట్లో నా ఫొటో పెట్టుకొనేలా చేస్తానని జగనన్న చెప్పారు. – చంద్రబాబు అప్పులు చేసి ఆ డబ్బంతా తెలుగుదేశం కార్యకర్తలకు, జన్మభూమి కమిటీలకు దోచిపెట్టాడు. – ఇచ్చిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చిన జగనన్న. మాట తప్పడు, మడమ తిప్పడు. – ఒంగోలులో రూ.350 కోట్లతో మంచి నీటి పథకం తెచ్చాం. త్వరలో సీఎం ఒంగోలు వస్తారు. ఆ పథకాన్ని శంకుస్థాపన చేస్తారు. – రిమ్స్ ఏర్పాటు చేశాం. కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ కు సీఎం శంకుస్థాపన చేస్తారు. – రూ.90 కోట్లతో పోతురాజు కాల్వ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. రూ.200 కోట్లు రోడ్లు, డ్రెయిన్లకు ఖర్చు పెట్టాం. – ఒంగోలులో 25 వేల ఇంటి పట్టాలిస్తామని చెప్పాం. కానీ టీడీపీ కోర్టులో కేసు వేయడంతో ఆగిపోయింది. ఈ నెలలో డబ్బులు పడతాయి. వచ్చే నెలలో పట్టాలు ఇస్తాం. – పట్టాలు ఇవ్వకపోతే నేను ఒంగోలు నుంచి పోటీ చేయను